TS Projects In Danger Zone: డేంజర్‌లో జంట జలాశయాలు..!

అతి భారీ వర్షాలతో తెలంగాణ అతలాకుతలం అయింది. ఎడతెరిపిలేని వర్షాలు బీభత్సం సృష్టింస్తున్నాయి. రాష్ట్రంలోని పలు జలశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలతో ప్రాజెక్టులలోకి వరద ఉదృతి కొనసాగుతుంది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామబాద్, మహబూబ్‌నగర్ తదితర జిల్లాలోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకోవడంతో దిగువనున్న ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

New Update
TS Projects In Danger Zone: డేంజర్‌లో జంట జలాశయాలు..!

TS Projects In Danger Zone: అతి భారీ వర్షాలతో తెలంగాణ అతలాకుతలం అయింది. ఎడతెరిపిలేని వర్షాలు బీభత్సం సృష్టింస్తున్నాయి. రాష్ట్రంలోని పలు జలశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలతో ప్రాజెక్టులలోకి వరద ఉదృతి కొనసాగుతుంది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లకు వరద నీరు పొటెత్తుతోంది. ఇప్పటికే రెండు రిజర్వాయర్లు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువలో ఉన్నాయి. మరో రెండు రోజులు పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. జలమండలి అధికారులు జంట జలాశయాల చెరో రెండు గేట్లను 2అడుగుల మేర ఎత్తారు. హిమాయత్ సాగర్ రెండు గేట్ల ద్వారా మొత్తం 1373 క్యూసెక్కుల నీటిని, ఉస్మాన్ సాగర్ రెండు గేట్ల ద్వారా మొత్తం 442 క్యూసెక్కుల నీటిని  మూసీ నదిలోకి విడుదల చేశారు. ఈ క్రమంలో మూసి పరివాహక ప్రాంతాల  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచిస్తున్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విస్తారంగా కురిసిన వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోయర్ మానేయడు డ్యాంకు సంబంధించిన ఆర్ గేట్లు ఎత్తడంతో 20వేల క్యూసెక్కులు విడుదల చేశారు. రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల వ్యాప్తంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు పోలీస్ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు.

Also Read: తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్‌దే గెలుపు.. పీకే కీలక వ్యాఖ్యలు

నిజాంసాగర్ ప్రాజెక్ట్ లోకి వరద నీరు ఉదృతంగా కొనసాగుతుంది. ఎగువ ప్రాంతాల నుండి ప్రాజెక్ట్ లోకి 29800 క్యూసెక్కుల వరద నీరు వస్తుండడంతో ప్రాజెక్ట్ 4 ప్రధాన గేట్లను ఎత్తి దిగువనున్న మంజీర నదిలోకి నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులు కాగ.. ప్రస్తుతం 1404.50 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 17.802 టీఎంసీ లు ఉండగా..ప్రస్తుతం 17.079 టీఎంసీ లకు చేరుకుంది. మంజీర పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్ట్ అధికారులు సూచిస్తున్నారు.

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని కౌలాస్ నాల ప్రాజెక్టు కు ఎగువ ప్రాంతం నుంచి 555 క్యూసెక్కుల వరద నీరు చేరింది. దీంతో ప్రాజెక్ట్ అధికారులు ఒక గేటును ఎత్తి దిగువకు 527 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్లకు గాను ప్రస్తుతం 457.30 మీటర్ల కు చేరుకుంది.ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 1.237 టీఎంసీ లు ఉండగా ప్రస్తుతం 1.077 టీఎంసీ లకు చేరుకుందని అధికారులు తెలిపారు.

Also Read: ‘ఇండియా’ పేరును రాజ్యాంగం నుంచి తొలగింపు..? బీజేపీ ఏం చేయబోతోంది?

Advertisment
తాజా కథనాలు