Tomato Price: టమాటా ఎంతో తెలిస్తే.. షాక్‌ అవ్వాల్సిందే..!

టమాటా ధరలతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. ఉంటే అతివృష్టి.. లేకుంటే అనావృష్టి.. అన్నట్లుగా ఉంది టమోటా రైతుల పరిస్థితి.సెంచరీ, డబుల్ సెంచరీ దాటి కొనుగోలుదారులకు కన్నీళ్లు తెప్పించిన టమాటా... ఇప్పుడు అన్నదాతలకు కంట నీరు తెప్పిస్తుంది. గత నెలలో టమాటా ధర కిలో రూ.200కు పైన పలికింది.అయితే, ఇప్పుడు రూ.1కి కూడా కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.దీంతో టమాటాను రైతులు రోడ్ల మీద పారబోస్తున్నారు.

New Update
Tomato Price: టమాటా ఎంతో తెలిస్తే.. షాక్‌ అవ్వాల్సిందే..!

Tomato Price Falls in AP:కొండెక్కిన టమాటా  కిందికి దిగొచ్చింది. టమాటా ధరలతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. ఉంటే అతివృష్టి.. లేకుంటే అనావృష్టి.. అన్నట్లుగా ఉంది టమోటా రైతుల పరిస్థితి.సెంచరీ, డబుల్ సెంచరీ దాటి కొనుగోలుదారులకు కన్నీళ్లు తెప్పించిన టమాటా... ఇప్పుడు అన్నదాతలకు కంట నీరు తెప్పిస్తుంది. గత నెలలో టమాటా ధర కిలో రూ.200కు పైన పలికింది.అయితే, ఇప్పుడు రూ.1కి కూడా కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.దీంతో టమాటాను రైతులు రోడ్ల మీద పారబోస్తున్నారు.

మార్కెట్ లో టమోటా రేట్లు దారుణంగా పడిపోయాయి. కిలో రూ.5 నుంచి రూ.10 లోపే పలుకుతున్నాయి. రైతులకు మాత్రం కిలోకు రూ.2 చెల్లిస్తుండడంతో రైతులు అవాక్కవుతున్నారు.కూలీ, రవాణా ఖర్చులు కూడా రావడం లేదని కన్నీటిపర్యంతమవుతున్నారు. దీంతో పంటను పొలాల్లోనే వదిలేస్తున్నారు.వేలకు వేలు పెట్టుబడి పెట్టి పంట పండిస్తే సరైన ధర దక్కక నట్టేట మునిగిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు పెట్టుబడులు పెట్టారు. సరిగ్గా అమ్ముకునే సమయంలో ధర పడిపోయింది. టమాటాలు తెంపి మార్కెట్​తీసుకుపోతే వ్యాపారులు రూ.2 నుంచి రూ.3 లోపే ఇస్తామని తేల్చి చెప్పేస్తున్నారు.

నంద్యాల జిల్లా ప్యాపిలి టమాటా మార్కెట్‌లో ధరలు లేకపోవడంతో రైతులు టమాటాను అక్కడే పారబోసి వెళ్లిపోయారు.వాటిని పశువులు మేశాయి.ధర బాగా తగ్గడంతో కనీసం ఖర్చులు కూడా రావడం లేదని అన్నదాతలు వాపోతున్నారు.ఏపీలో దాదాపు అన్ని మార్కెట్‌లలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది.కిలో టమాటా ప్యాపిలిలో రూ.3 పలుకుతోంది.కొన్ని ప్రాంతాల్లో కనీసం రూ.1కి కూడా ఎవరూ కొనేందుకు ముందుకు రావడం లేదు.మదనపల్లి మార్కెట్‌లోను ధరలు దారుణంగా పడిపోయాయి.

గత నెలలో సామాన్య, మధ్యతరగతి ప్రజలు కూరగాయలు కొనాలంటేనే భయం పడేవారు. ముఖ్యంగా టమాటా ధరలు అస్సలు కొనలేని పరిస్ధితి కనిపించింది. ఎన్నడూ లేని విధంగా టమాటా ధర గరిష్ట స్థాయికి చేరుకుంది. సాధారణంగా ఒక్కో బాక్స్ ధర రూ. 500 లోపే ఉంటుంది.కానీ, ఈ ఏడాది ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ధరలు పలికఇంది.కిలో రూ.200కు పైన పలికింది.ఇందుకు కారణం డిమాండ్ కు తగట్లు సప్లై లేకపోవడమే.టమాటా రైతులు కోటీశ్వర్లు కూడా అయ్యారు.మరికొన్ని చోట్ల డబ్బుల కోసం రైతులపై దాడి కూడా జరిగిన ఘటనలు చోటుచేసుకున్నాయి.

Also Read: రెండ్రోజుల పాటు ఏపీ, తెలంగాణలకు వర్ష సూచన.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక!

Advertisment
తాజా కథనాలు