AP: శ్రీచైతన్య విద్య సంస్థ తీరుపై SFI ఆందోళన.. సీరియస్ యాక్షన్‌ తీసుకున్న అధికారులు..!

పశ్చిమగోదావరి జిల్లా కుముదవల్లిలో శ్రీచైతన్య విద్య సంస్థ తీరుపై SFI నాయకులు ఆందోళన చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా స్కూల్‌లో యూనిఫాం, పుస్తకాలు అమ్మకాలు అమ్ముతున్నారని MEOకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన అధికారులు యూనిఫాం, పుస్తకాలు ఉన్న గదిని సీజ్ చేశారు.

New Update
AP: శ్రీచైతన్య విద్య సంస్థ తీరుపై SFI ఆందోళన.. సీరియస్ యాక్షన్‌ తీసుకున్న అధికారులు..!

West Godavari: పశ్చిమగోదావరి పాలకోడేరు మండలం కుముదవల్లిలో నిబంధనలకు విరుద్ధంగా శ్రీచైతన్య విద్య సంస్థ పనిచేస్తోంది. స్కూల్ లో జోరుగా యూనిఫాం, పుస్తకాలు అమ్మకాలు చేస్తున్నారు. స్కూల్ లోనే పుస్తకాలు, యూనిఫాం కొనాలి అంటూ నిబంధన విధించారు. ఈ సమాచారం తెలుసుకున్న SFI నాయకులు ఆందోళనకు దిగారు.

Also Read: అయ్యో పాపం జేజమ్మ.. అనుష్క అతిగా నవ్వితే అంతేనట!

వెంటనే ఈ విషయంపై MEO నాగరాజుకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన అధికారులు స్కూల్ దగ్గరకు వచ్చి పరిశీలించారు. యూనిఫాం, పుస్తకాలు ఉన్న గదిని సీజ్ చేశారు. అయితే, గత సంవత్సరంలో కూడా శ్రీచైతన్య విద్య సంస్థ ఇదే రీతిలో పనిచేసిందంటున్నారు విద్యార్ధి సంఘం నాయకులు.

Advertisment
తాజా కథనాలు