Johnny Master: కోరిక తీర్చాలని కొట్టారు.. జానీ కేసులో కొత్త ట్విస్ట్!

జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో మరో సంచలన ట్విస్ట్ చోటుచేసుకుంది. పోలీసుల స్టేట్మెంట్ లో బాధితురాలు కీలక విషయాలు తెలిపింది. జానీ మాస్టర్ భార్య కూడా తనను వేదించిందని. అతని కోరిక తీర్చకపోతే బలవంతంగా దాడికి దిగేవారని చెప్పింది.

New Update

johnny Master: టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. అతని దగ్గర పనిచేసి లేడీ కొరియోగ్రాఫర్ తన పై జానీ లైగింక దాడికి పాల్పడ్డాడని కేసు పెట్టింది. దీంతో అజ్ఞాతంలోకి వెళ్లాడు. సోమవారం ఉదయం నుంచి జానీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుండగా.. అతని కోసం పోలీసులు బృందాలు వేట కొనసాగిస్తున్నాయి. అలాగే జానీ చివరిగా ఎవరితో మాట్లాడాడు అనే దానిపై ఎంక్వైరీ చేస్తున్నారు.

జానీ భార్యా కూడా కోరిక తీర్చమని వేధించింది

ఇది ఇలా ఉండగా జానీ మాస్టర్ కేసులో మరో సంచలన ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆయన భార్య పై కూడా ఆరోపణలు రావడం హాట్ టాపిక్ గా మారింది. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ మరికొన్ని కీలక విషయాలు బయటపడ్డాయి. జానీ భార్య కూడా తనను వేధించిందని. అతని కోరిక తీర్చకపోతే బలవంతంగా దాడికి చేసేవారని తెలిపింది. వాళ్ళ వేధింపులు తట్టుకోలేక బయటకు వెళ్లి పని చేసుకోవాలని అనుకున్నాను. కానీ భార్య భర్తలు ఇద్దరు ఇంటికి వచ్చి కూడా దాడి చేశారని తెలిపింది.

FIRలో జానీ గురించి నమ్మలేని నిజాలు

జానీ మాస్టర్ కేసులో బాధితురాలు పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ లో మరి కొన్ని నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. జానీ మాస్టర్ దగ్గర తాను
అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా జాయిన్ అయిన రోజు నుంచి అతని సెక్స్ కోరిక తీర్చమని తనను వేధించేవాడని. కోరిక తీర్చకుంటే ఇండస్ట్రీలో అవకాశాలు లేకుండా చేస్తానని బెదిరించేవాడని తెలిపింది. అంతే కాదు షూటింగ్ జరుగుతున్న సమయంలో తన వ్యాన్ లోకి వచ్చి ప్యాంట్ తీసి బలవంతం చేసేవాడని.. వద్దని చెబితే తలని అద్దానికి కొట్టేవాడని బాధితురాలు పేర్కొంది. మతం మార్చుకొని తనను పెళ్లి చేసుకోవాలని కూడా జానీ బలవంత పెట్టినట్లు బాధితురాలు FIRలో తెలిపింది. తనను శారీరకంగా, మానసికంగా వేధించిన జానీ మాస్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఇప్పటికే జానీ పై IPC 376, 323, 506 సెక్షన్ల కింద కేసు నమోదైంది.

Advertisment
తాజా కథనాలు