నష్టపోయిన మత్స్యకారులకు అండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్.!

విశాఖ ఫిషింగ్ హార్బర్ లో నష్టపోయిన మత్స్యకారులకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అండగా నిలిచారు. బాధిత మత్స్యకారులకు రూ.50 వేలు చొప్పున చెక్కులు అందించారు. ఇలా డబ్బులు ఇస్తోంది నేనున్నానే భరోసా కల్పించడానికే కానీ ఎన్నికల కోసం కాదని స్పష్టం చేశారు.

నష్టపోయిన మత్స్యకారులకు అండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్.!
New Update

Pawan Kalyan: విశాఖ ఫిషింగ్ హార్బర్ లో అగ్ని ప్రమాద బాధితులకు నష్ట పరిహారం అందించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. 49 మంది బాధిత మత్స్యకారులకు రూ.50 వేలు చొప్పున చెక్కులు అందించారు. అనంతరం పవన్ ప్రసంగించారు. ఈ నెల 19న జరిగిన అగ్నిప్రమాదంలో బోట్లు దగ్ధం కావడం బాధాకరమని పేర్కొన్నారు.

'నేనిచ్చే సొమ్ముతో బాధితుల కష్టాలు తీరిపోతాయని నేను నమ్మను. కానీ, మీకు కష్టం వస్తే పవన్ కల్యాణ్ ఉన్నాడు, జనసేన పార్టీ ఉంది, మా నేతలు ఉన్నారు, మా వీర మహిళలు ఉన్నారు, మా జన సైనికులు ఉన్నారు... సాటి మనిషిని ఆదుకునేవారు ఉన్నారనే భరోసా కల్పించడమే మా ఉద్దేశం. గతంలో కౌలు రైతులకు కూడా ఇలాగే సాయం చేశాం. ఇవాళ దాదాపు రూ.30 లక్షలు మత్స్యకార సోదరులకు అందించాం. ఇంతటితో మీ కష్టాలు తీర్చేశాను అని చెప్పను.. కానీ మీ కష్టాల్లో, మీ కన్నీళ్లలో నేను కూడా భాగం పంచుకుంటాను అని మాత్రం చెప్పగలను. అందులో భాగంగానే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం'.

అయితే, ఇక్కడ చీకటి గ్యాంగ్ లు పెరిగాయన్నారు. హార్బర్ లో ఏ పరిస్థితి ఉందొ..రాష్ట్రంలోనూ అదే పరిస్థితి ఉందని వ్యాఖ్యనించారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో రాత్రి 7 తరవాత వెళ్ళాలి అంటే భయం వేస్తోందని వ్యాఖ్యనించారు. గుజరాత్, కేరళలో పది కిలోమీటర్లు కు ఒక జెట్టి ఉందని..ఇక్కడ మన రాష్ట్రంలో ఒక్క జెట్టి కూడా సరిగా లేదని విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వం మత్స్యకారులకు నష్ట పరిహరం ప్రకటించింది ఒకటి అయితే.. ఇచ్చిన సొమ్ము ఇంకొటి అని దుయ్యబట్టారు.

Also Read: నమ్మించి మహిళను నట్టేట ముంచిన పెద్దిరాజు.!

రూ. 450 కోట్లు పెట్టి రుషి కొండలో జగన్ బాబు ఇల్లు కట్టాడని మండిపడ్డారు. అదే డబ్బులతో హార్బర్ కడితే మత్స్య కారులకు ఉపయోగ పడుతుందని అన్నారు. జీవో 217 ఐర్లాండ్ ఫిషరీస్ చట్టాన్ని కాల రాశారని ధ్వజమెత్తారు. తాను మత్స్యకారుల క్షేమం కోరుకునే వాడినని.. ఒక పదేళ్లు నమ్మండి..మీకు మంచి భవిష్యత్ ఇస్తాను అంటూ భరోసా కల్పించారు. ఈ నేపథ్యంలోనే వచ్చేది టిడిపి జనసేన కూటమి ప్రభుత్వం అని ధీమ వ్యక్తం చేశారు. భవిష్యత్ మనది, భవిష్యత్ మీది అంటూ వ్యాఖ్యనించారు.

#jana-sena-chief-pawan-kalyan #andhra-paradesh
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe