Nagababu: రెండు ఓట్ల వివాదంలో నాగబాబు ఫ్యామిలీ.. వైరల్ అవుతోన్న అప్లికేషన్!

నాగబాబు కుటుంబ సభ్యులు ఏపీలోని మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవడం వివాదాస్పదంగా మారింది. వీరు ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Nagababu: రెండు ఓట్ల వివాదంలో నాగబాబు ఫ్యామిలీ.. వైరల్ అవుతోన్న అప్లికేషన్!
New Update

ప్రముఖ సినీ నటుడు, జనసేన నేత నాగబాబు (Nagababu) రెండు ఓట్ల వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో (Telangana Elections 2023) నాగబాబు కుటుంబం ఓటు హక్కును వినియోగించుకుంది. తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో ఓటు హక్కు కోసం నాగబాబు కుటుంబ సభ్యులు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో సామాజిక మాద్యమంలో నాగబాబు ఓటర్ అప్లికేషన్ వైరల్ అవుతోంది. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకుని.. మళ్లీ ఇప్పుడు ఏపీలోని మంగళగిరి నియోజకవర్గంలో ఓటు నమోదుకు అప్లై చేయడంపై విమర్శలు వస్తున్నాయి.

ఇది కూడా చదవండి: AP politics : ఎన్నికల మీద ఫుల్ ఫోకస్ పెట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు..నేతలకు టార్గెట్లు ఫిక్స్

ఏపీలో మరికొన్ని నెలల్లో ఎన్నికల నేపథ్యంలో ఈ అంశం చర్చనీయాంశమైంది. ఒక చోటు ఓటు ఉండగా.. మరో చోటు ఓటు హక్కు నమోదు చేసుకోవడం ఏంటని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. బాధ్యత కలిగిన వ్యక్తులు ఇలా చేస్తారా? అంటూ వైసీపీ విమర్శలు చేస్తోంది. దీంతో.. ఈ అంశంపై నాగబాబు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది.

ఇదిలా ఉంటే.. ఏపీలోని చాలా మంది హైదరాబాద్ లోనూ ఓటు హక్కు కలిగి ఉన్నారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. తెలంగాణలో ఇటీవల జరిగన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వారికి తెలంగాణలో ఓటు వేసే అవకాశం కల్పించవద్దని ఎన్నికల అధికారులను ఇప్పటికే వైసీపీ నేతలు కోరారు.

#nagababu
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe