The Gmail mobile app now allows users to translate emails directly within the app: జీమెయిల్ మొబైల్ యాప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో అప్‌డేట్ అవుతోంది. మొబైల్ యాప్ నుంచే ఇప్పుడు ఈమెయిల్స్‌ని ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు. ఒకప్పుడు ఈ ఫీచర్ జీమెయిల్ వెబ్ వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు కొత్త ఫీచర్ ఆండ్రాయిడ్, iOS డివైజ్‌లకు అందుబాటులోకి వస్తోంది. ఒక బ్లాగ్ పోస్ట్‌లో గూగుల్ దీనిపై క్లారిటీ ఇచ్చింది. ఏళ్లు పాటు 100కు పైగా భాషల్లో జీమెయిల్స్‌ని ట్రాన్స్‌లేట్ చేసుకున్నారని.. ఇప్పుడు మొబైల్ యాప్‌లోనూ ఈ అనువాదం అందుబాటులోకి వచ్చిందని చెప్పింది.
ఎలా ట్రాన్స్‌లేట్ చేయాలి?
➼ ముందు జీమెయిల్ యాప్‌ని ఓపెన్ చేయండి.
➼ మీరు ట్రాన్స్‌లేట్ చేయాలనుకుంటున్న మెయిల్‌ను ఓపెన్ చేయండి.
➼ ఈమెయిల్ రైట్ సైడ్ మూలలో ఉన్న మూడు డాట్స్‌పై క్లిక్ చేయండి.
➼ ట్రాన్స్‌లేట్ ఆప్షన్‌ని క్లిక్ చేయండి
➼ మీరు ఈమెయిల్‌ను అనువదించాలనుకుంటున్న భాషను ఎంచుకోండి.
➼ వెంటనే మీరు ఎంచుకున్న భాషలో ట్రాన్స్‌లేట్ అవుతుంది.
గుర్తుంచుకోవాల్సిన విషయాలు:
• ట్రాన్స్‌లేషన్ ప్రస్తుతం బీటా దశలో ఉంది.
• ట్రాన్స్‌లేషన్ కంటెంట్‌లో అప్పుడప్పుడు తప్పులు లేదా లోపాలు ఉండవచ్చు.
• ట్రాన్స్‌లేషన్ పూర్తిగా పర్‌ఫెక్ట్ కాదు.
• ఫీచర్ మిమ్మల్ని ఒకేసారి ఒక ఈమెయిల్‌ను మాత్రమే ట్రాన్స్‌లేట్ చేయడానికి అనుమతిస్తుంది.
• మీకు విదేశీ భాషలో మల్టి ఈమెయిల్‌లు ఉంటే, మీరు వాటిని ఒక్కొక్కటిగా ట్రాన్స్‌లేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
• ఈ ఫీచర్ క్రమంగా వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది.
• కాబట్టి మీకు మీ జీమెయిల్ యాప్‌లో ఫీచర్ కనిపించకపోతే, యాప్‌ను అప్‌డేట్ చేయండి లేదా వెయిట్ చేయండి.
జీమెయిల్స్‌లో స్పామ్ మెసేజీలును ఎలా బ్లాక్ చేయాలి?
➊ Gmail స్పామ్ ఫిల్టర్‌ని యాక్టివేట్ చేయండి.
➋ ఈమెయిల్‌లను స్పామ్‌గా గుర్తించండి.
➌ ఫిల్టర్‌లను సృష్టించండి.
➍ స్టోరేజ్ స్పెస్‌ని క్లీన్ అప్ చేయండి.