BREAKING: తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అరెస్ట్..! హైటెన్షన్‌

తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఇందిరాపార్క్‌ వద్ద ఉదయం నుంచి దీక్ష కొనసాగిస్తున్న కిషన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇందిరాపార్క్‌ వద్ద ఉద్రిక్తత వాతావరణ చోటు చేసుకుంది. హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు అడ్డుకున్నారు

BREAKING: తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అరెస్ట్..!  హైటెన్షన్‌
New Update

తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఇందిరాపార్క్‌ వద్ద ఉదయం నుంచి దీక్ష కొనసాగిస్తున్న కిషన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇందిరాపార్క్‌ వద్ద ఉద్రిక్తత వాతావరణ చోటు చేసుకుంది. 24 గంటల దీక్ష చేస్తున్న బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీక్షకు ఆరు గంటల వరకే పర్మిషన్ ఉందంటున్నారు పోలీసులు. అటు పోలీసులు.. ఇటు కార్యకర్తలు కిషన్‌రెడ్డిని చుట్టుముట్టారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా కార్యకర్తల నినాదాలు చేశారు.

మరోవైపు కేసీఆర్‌ టార్గెట్‌గా బీజేపీ అగ్రనేతలు మండిపడ్డారు. కేసీఆర్ బాత్రూంలో మందు తాగి, తిని దీక్ష చేశారని బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటివి ఏమైనా బీజేపీ దీక్షలో జరుగుతున్నాయా అని చూసేందుకు స్టేట్‌లో ఉన్న ఇంటెలిజెన్స్ మొత్తాన్ని హైదరాబాద్‌లో దించారని ఆరోపించారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ చేపట్టిన నిరాహార దీక్ష కొనసాగుతోంది. ఉద్యోగుల కోసం బీజేపీ అగ్రనేతలు గొంతెత్తారు. గులాబీ సర్కార్‌ టార్గెట్‌గా ఫైర్ అయ్యారు.

బండి సంజయ్‌ తీవ్ర విమర్శలు:
తెలంగాణ ప్రజలు నాశనం కావాలని కవిత కామాఖ్య ఆలయంలో పూజలు చేసి వచ్చిందని మండిపడ్డారు బండి సంజయ్. కిషన్ రెడ్డికి కేసీఆర్ లాగా మందు అలవాటు లేదన్నారు. అమెరికాలో తెలంగాణ యువకులు హోటళ్లలో పని చేస్తున్నారని.. ఇక్కడి వరకు వచ్చి ఇబ్బందులు పడటానికి కారణం కేసీఆర్ అని చెబుతున్నారన్నారు. అక్కడ ఉద్యోగాలు లేక ఇంజినీరింగ్, డాక్టర్ చదివి హోటళ్లలో పని చేయాల్సి వస్తుందని చెప్పి ఆవేదన వ్యక్తంచేశారు. తల్లిదండ్రులకు సాఫ్ట్ వేర్‌లో చేస్తున్నామని అబద్దాలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు బండి సంజయ్. తెలంగాణలో మంత్రులకు అధికారాలు లేవన్నారు బండి సంజయ్. కేసీఆర్ మోచేతి నీళ్లు తాగే పదవీ విరమణ పొందరని.. సలహాదారులుగా కొనసాగుతున్న వారికే అధికారులు ఉన్నాయన్నారు. జమిలి ఎన్నికలపై కేసీఆర్ అల్లుడు, కొడుకు మాట్లాడుతున్నారని.. జమిలి వస్తే మోదీ చరిష్మా ముందు తమను పట్టించుకోరని కేసీఆర్ భయపడుతున్నాడని కౌంటర్లు వేశారు బండి సంజయ్. తెలంగాణ రాకముందు అధికారికంగా విమోచన దినోత్సవాలు జరపాలని డిమాండ్ చేసిన కేసీఆర్ ఇప్పుడు సమైక్యత దినోత్సవం చేస్తున్నారన్నారు. ఒవైసీకి కోపం రావద్దు అనే కేసీఆర్ ఇలా చేస్తున్నారన్నారు. విమోచన దినోత్సవం రోజు ఎమ్‌ఐఎమ్‌ నల్ల జెండాలతో నిరసన తెలిపిందన్నారు బండి సంజయ్. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని వీటిలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదని.. ఎన్నికల తర్వాత ఒక్కటవుతాయన్నారు.

తరుణ్ చుగ్ ఏం అన్నారంటే?:

‣ ఇందిరా పార్క్ నిరాహార దీక్ష వద్ద నిరుద్యోగుల సమస్యలపై తాము చేస్తున్న పోరాటంతో అయినా కేసీఆర్ సర్కార్ నిద్ర లేవాలి..

‣ చెవిటి, గుడ్డి ప్రభుత్వం ఇకనైనా మేల్కోవాలి

‣ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారు

‣ ఏది కూడా నెరవేర్చలేదు

‣ ఈ నవంబర్‌తో తెలంగాణకు పట్టిన కేసీఆర్ అనే మకిలి వీడుతుంది

‣ కేసీఆర్ సర్కార్‌ను వైట్ వాష్ చేసి పంపిస్తారు

‣ నువ్ ఇస్తానని చెప్పిన డబుల్ ఇండ్లు ఏవి?

‣ సిగ్గు, శరం లేని ప్రభుత్వం

‣ దళిత బంధు ఏది కేసీఆర్? ఎందరికి ఇచ్చావు

‣ కేసీఆర్ ఒక రాజాబాబు.. తెలంగాణలో కుటుంబ పాలన చేస్తున్నారు

‣ గతంలో విదేశాల్లో ఉద్యోగం చేసుకునే కేటీఆర్ ఇప్పుడు మంత్రి అయ్యాడు

‣ ప్యాలెస్‌లో ఉండి ప్రజా పాలన పక్కనపెట్టి ప్రజలను దోచుకుంటున్నారు

‣ పదవులు కుటుంబ సభ్యులకే ఇచ్చుకున్నారు

‣ తెలంగాణ కోసం పోరాడిన వారికి మీరు ఏం చేశారు?

‣ ప్రశ్నించిన బండి సంజయ్ ను జైల్లో పెట్టారు..

‣ యువత గురించి పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీ

‣ నిరుద్యోగులకు, యువతకు అండగా మేముంటాం

‣ దేశంలో ల్యాండ్ మాఫియా జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్ వన్‌లో ఉంది.. దీని వెనుక కేసీఆర్ హస్తం ఉంది

‣ కేసీఆర్ సర్కార్.. బై.. బై.!

డీకే అరుణ ఫైర్:
సెంటిమెంట్ పేరుతో కేసీఆర్ నిరుద్యోగ యువత ప్రాణాలు బలిగొన్నారని ఆరోపించారు. బీజేపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. 12వందల మంది ఉసురుపోసుకొని కేసీఆర్ గద్దెనెక్కారని ఆరోపించారు. అసెంబ్లీ సాక్షిగా లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తానన్న కేసీఆర్.. నిరుద్యోగులుగానే ఉంచారని..వారి ఆశలను నెరవేర్చలేదన్నారు. ఇప్పటి వరకు డిఎస్సీ వేయకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేరని విమర్శించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి ప్రశ్నపత్రాలు లీక్ చేశారని ఫైర్ అయ్యారు. ప్రశ్నపత్రాలు లీక్ చేసిన వారిపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని.. ఎందుకంటే వీటి వెనుక ప్రభుత్వం హస్తం ఉందన్నారు. కాంట్రాక్ట్ వ్యవస్థ ఇంకా ఎందుకు నడుస్తుందో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు అరుణ. ఎన్నికలు వచ్చినప్పుడు లబ్ధి పొందేందుకు అనేక ప్రకటనలు ఇస్తున్నారని.. నిరుద్యోగ భృతి, రెండు పడక గదుల ఇళ్లు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. ప్రాజెక్టుల పేరుతో దోపిడీ చేసిన కేసీఆర్‌కు ప్రజలు తగిన బుద్ది చెబుతారన్నారు. పూర్తి కానీ ప్రాజెక్టును ప్రారంభించేందుకు మీకు సిగ్గు లేదా అని నిలదీశారు.

ALSO READ: తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధిస్తారా..? బీఆర్ఎస్ నేతల మాటల మర్మం ఏమిటి..?

#bjp-protests
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe