Vishwak Sen: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ గాయపడ్డారని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. విశ్వక్ హీరోగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే మూవీ తెరకెక్కుతోంది. కృష్ణ చైతన్య ఈ మూవీని డైరెక్ట్ చేస్తుండగా.. సితార ఎంటర్ టైన్ మెంట్ పై నాగ వంశీ నిర్మిస్తున్నారు.
ఈ చిత్రాన్ని డిసెంబర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ క్రమంలో యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు. ఈ స్టంట్ కోసం విశ్వక్ రిహార్సల్స్ చేస్తుండగా.. గాయపడ్డారని సమాచారం. తోటి నటులు, ఫైటర్స్ తో కలిసి లారీ మీద స్టంట్ ప్రాక్టీస్ చేస్తుండగా.. స్లిప్ అయ్యి కింద పడ్డారట. దీంతో ఒక్కసారిగా షాకైన మూవీ యూనిట్.. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆయన కాలికి గాయం అయినట్లు తెలుస్తోంది.
గ్యాంగ్ ఆఫ్ గోదావరిలో నేహా శెట్టి హీరోయిన్గా నటిస్తున్నసంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై హైప్ తెస్తున్నాయి.డిసెంబర్ 8న ఈ సినిమా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ఆయన గాయపడటంతో ఆ మూవీ విడుదలపై అనుమానాలు తలెత్తుతున్నాయి. మరీ అనుకున్న సమయానికే ఈ మూవీ విడుదలౌతుందో లేదో చూడాలి.
యువ నటుడు విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వరుస సినిమాల్లో నటిస్తూ అదరగొడుతున్నారు. రిసెంట్ గా ఆయన హీరోగా వచ్చిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా దాస్ కా ధమ్కీ . మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ స్వయంగా నటిస్తూ, నిర్మించారు. ఇక ఆ సినిమా తర్వాత విశ్వక్ సేన్ సితార బ్యానర్లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari) అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: పుష్ప-2 మామూలుగా ఉండదు అంటున్న డీఎస్పీ