AUS vs SA: ఇదేం ఊచకోత రా బాబూ.. ఏకంగా 36 ఫోర్లు, 20 సిక్సర్లు

వన్డేల్లో నెంబర్ ర్యాంక్ జట్టుగా ఉన్న ఆస్ట్రేలియా బౌలర్లకు సౌతాఫ్రికా బౌలర్లు ఊచకోత అంటే ఏంటో చూపించారు. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా సెంచూరియన్ వేదికగా శుక్రవారం జరిగిన నాలుగో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన ప్రొటీస్ జట్టే ఏకంగా 416 పరుగులు భారీ స్కోర్ చేసింది.

New Update
AUS vs SA: ఇదేం ఊచకోత రా బాబూ.. ఏకంగా 36 ఫోర్లు, 20 సిక్సర్లు

Heinrich Klaasen Smashes 174 runs against Australia: వన్డేల్లో నెంబర్ ర్యాంక్ జట్టుగా ఉన్న ఆస్ట్రేలియా బౌలర్లకు సౌతాఫ్రికా బౌలర్లు ఊచకోత అంటే ఏంటో చూపించారు. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా సెంచూరియన్ వేదికగా శుక్రవారం జరిగిన నాలుగో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన ప్రొటీస్ జట్టే ఏకంగా 416 పరుగులు భారీ స్కోర్ చేసింది. ఎవడైనా కోపంగా కొడతాడు లేకపోతే బలంగా కొడతాడు.. వీడేంట్రా చాలా శ్రద్ధగా కొట్టాడు.. అంటూ అతడు సినిమాలోని డైలాగ్‌కు సరిగా సరిపోయేలా సౌతాఫ్రికా బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ విశ్వరూపం చూపించాడు. 83 బంతుల్లోనే ఏకంగా 174 పరుగులు చేసి విధ్వంసం అంటే ఏంటో చూపించాడు. ఇందులో 13 ఫోర్లు, 13 సిక్సర్లు ఉన్నాయంటే క్లాసెన్ విధ్వంసం ఏ రీతిలో సాగిందో తెలుసుకోవచ్చు. 52 బంతుల్లోనే సెంచరీ చేసిన హెన్రిచ్.. మిగిలిన 15 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు.

మంచి ఊపు మీదున్న క్లాసెన్‌కు హిట్టర్ డేవిడ్ మిల్లర్ కూడా తోడయ్యాడు. 45 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 82 పరుగులు సాధించాడు. దీంతో ఆసీస్ బౌలర్లకు పట్టపగలే చుక్కలు కనపడ్డాయి. ముఖ్యంగా ఆడమ్ జంపాను అయితే ఓ ఆట ఆడుతుకున్నారు. వీరి దెబ్బకు జంపా 10 ఓవర్లలో 113 పరుగులు సమర్పించుకున్నాడు.  ఇద్దరు ఎంతటి విధ్వంసం సృష్టించారంటే చివరి 9ఓవర్లలో 164 పరుగులు వచ్చాయి. దీంతో దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 416 పరుగులు చేసింది. ప్రొటీస్ ఇన్నింగ్స్‌లో మొత్తం 36 ఫోర్లు, 20 సిక్సర్లు నమోదయ్యాయి.

అనంతరం భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ జట్టు 34.5 ఓవర్లలో 252 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ క్రమంలో ఐదు వన్డేల సిరీస్‌లో ఇరు జట్లు 2-2తో సమంగా నిలిచాయి. ఇక సిరీస్ డిసైడ్ మ్యాచ్ ఆదివారం జరగనుంది. ఈ మ్యాచులో సౌతాఫ్రికా బ్యాటర్ల విశ్వరూపంతో అనేక రికార్డులు నమోదయ్యాయి. సౌతాఫ్రికా బౌలర్లతో ఎంగిడి 4, రబాడ 3 వికెట్లు తీశార.

ఇది కూడా చదవండి: పాక్‌ క్రికెట్ జట్టుతో ద్వైపాక్షిక సిరీస్‌లపై కేంద్రం క్లారిటీ

వన్డేల్లో ఏకంగా ఏడు సార్లు 400కు పైగా స్కోర్ సాధించిన తొలి జట్టుగా సాతాఫ్రికా నిలిచింది. ఆరు సార్లుతో భారత్ రెండో స్థానంలో ఉండగా.. ఇంగ్లాండ్ 4 సార్లు, ఆస్ట్రేలియా 2 సార్లుతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక ఆసీస్ బౌలర్ అడం జంపా 10 ఓవర్లలో 113 పరుగులు సమర్పించుకుని అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా చెత్త రికార్డు తన పేరిట నమోదు చేసుకున్నాడు. ఇక ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక పరుగులు చేసిన జాబితాలో క్లాసెన్(174) రెండో స్థానంలో నిలిచాడు. తొలి స్థానంలో భారత దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్( 175 నాటౌట్) ఉన్నారు. అంతేకాకుండా సౌతాఫ్రికా జట్టు తరపున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగానూ దిగ్గజాల సరసన క్లాసెన్ నిలిచాడు.

ఇది కూడా చదవండి: భారత్ కు బంగ్లాదేశ్ షాక్ ఇచ్చింది

Advertisment
తాజా కథనాలు