పబ్లిక్‌లో ప్రైవేట్ పార్ట్ తాకిన యువకుడు..చెంప పగలగొట్టిన ఎంపీ కూతురు!

యువ నటి ఈషా డియోల్ తాను లైంగిక వేధింపులకు గురైనట్లు తెలిపింది. ''దాస్' సినిమా ఈవెంట్‌కు హాజరైనప్పుడు ఓ వ్యక్తి నా ప్రైవేట్ పార్ట్ టచ్ చేశాడు. వెంట‌నే అత‌డిని గుంపులోనుంచి బ‌య‌ట‌కు లాగి చెంప పగలగొట్టాను. ఆడపిల్లలు ఎవరైనా బయపడకుండా ఇలాగే చేయాలి' అని సూచించింది.

New Update
Esha Deol

Esha Deol: సీనియర్ నటి, బీజేపీ ఎంపీ హేమ మాలిని కూతురు యువ నటి ఈషా డియోల్ సైతం లైంగిక వేధింపులకు గురైనట్లు తెలిపింది. 2005లో వ‌చ్చిన ‘దాస్’ అనే సినిమా ఈవెంట్‌లో తనకు చేధు అనుభవం ఎదురైనట్లు చెప్పింది. పుణెలో పలువురితో కలిసి సినిమా ఈవెంట్‌కు వెళ్లినప్పుడు ఒక వ్యక్తి తనను అసభ్యంగా తాకాడని, కావాలనే ప్రైవేట్ పార్ట్ టచ్ చేశాడంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అసహనం వ్యక్తం చేసింది. 

‘మేము అక్కడికి వెళ్లగానే మమ్మల్ని చూసేందుకు జ‌నాలు ఎగబడ్డారు. వారిని బౌన్సర్‌లు కంట్రోల్ చేసేందుకు ట్రై చేశారు. ఈ క్రమంలోనే వేడుక జ‌రుగుతున్న హాల్‌లోకి వెళుతుండ‌గా ఒక వ్యక్తి నన్ను బ్యాడ్ టచ్ చేశాడు. నాకు చాలా కోపం వచ్చింది. వెంట‌నే అత‌డిని బ‌య‌ట‌కు లాగి చెంపపగలగొట్టాను. అందరూ షాక్ అయ్యారు’ అని చెప్పింది ఈషా డియోల్. ఇక తాను నిజానికి చాలా కూల్ గా ఉంటానని, తప్పుగా ప్రవర్తిస్తే మాత్రం తప్పకుండా గట్టిగా బుద్ధిచెబుతానంటూ చెప్పుకొచ్చింది.

Advertisment
తాజా కథనాలు