Maruthi Nagar Subramanyam: ఓటీటీలోకి ‘మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం..!

తబిత సుకుమార్ సమర్పణలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం' ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 20 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ 'ఆహా' లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో రావు రమేష్ ప్రధాన పాత్రలో నటించారు.

author-image
By Archana
Maruthi Nagar Subramanyam 1

Maruthi Nagar Subramanyam

New Update

Maruthi Nagar Subramanyam: టాలీవుడ్ సీనియర్ నటుడు రావు రమేష్, ఇంద్రజ, అంకిత్‌ కొయ్య, రమ్య పసుపులేటి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'మారుతి నగర్ సుబ్రహ్మణ్యం'. ఈ చిత్రం ప్రముఖ దర్శకుడు సుకుమార్ భార్య తబిత సుకుమార్ సమర్పణలో రూపొందింది. ఆగస్టు 23న విడుదలైన ఈ మూవీ మంచి టాక్ సొంతం చేసుకుంది. ఓ యువత నిరుద్యోగ కష్టాల చుట్టూ తిరిగే ఈ కథ చక్కటి ఫ్యామిలీ ఎమోషన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం ఓటీటీ రిలీజ్

థియేటర్ రిలీజ్ తర్వాత ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ నెల 20 నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫార్మ్ 'ఆహా' లో స్ట్రీమింగ్ కానుంది. ఇందుకు సంబంధించి మేకర్స్ సోషల్ మీడియా వేదికగా పోస్టర్ రిలీజ్ చేశారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని లక్ష్మణ్ కార్య తెరకెక్కించారు. కళ్యాణ్ నాయక్ సంగీతం అందించారు.

Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe