Malaika Arora: తీరని దుఃఖంలో మలైకా.. నాన్నతో దిగిన ఫొటోలు వైరల్..!

నటి మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా మృతితో ఆమె ఫొటో, వీడియోస్ మరోసారి నెట్టింట వైరల్ అవుతున్నాయి. నాన్నతో కలిసి ఆమె ఆస్వాదించిన ఆనంద క్షణాలకు సంబంధించిన పలు పిక్స్ చూసి ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు.

author-image
By Archana
malaika arora father22

malaika father

New Update

Malaika Arora: బాలీవుడ్ ప్రముఖ నటి మలైకా అరోరా అనిల్ అరోరా తండ్రి ఆత్మహత్య చేసుకున్నారు. అనిల్ అరోరా ఈరోజు ఉదయం బాంద్రాలో ఆయన నివాసం ఉంటున్న అయేషా మనోర్ భవనంలోని ఏడో అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఇప్పటి వరకు అనిల్ అరోరా ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రాథమిక విచారణలో పోలీసులకు ఎటువంటి సూసైడ్ నాట్ కూడా లభించలేదని తెలుస్తోంది. మరోవైపు మలైకా సన్నిహిత వర్గాలు అనిల్ ఆత్మహత్య చేసుకోలేదని.. అది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన అని PTI కి తెలిపాయి. ప్రస్తుతం పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం అనిల్ అరోరా మృతదేహాన్ని బాబా ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. నటి మలైకా ఆమె తండ్రి మరణ వార్త గురించి తెలుసుకున్నప్పుడు పూణేలో ఉన్నారు. విషయం తెలియగానే మలైకా ముంబై చేరుకున్నారు.

పలు నివేదికల ప్రకారం మలైకా తల్లి జాయిస్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో.. అనిల్ రోజు ఉదయం బాల్కనీలో పేపర్ చదివేవాడిని. బుధవారం ఉదయం గదిలో ఆయన చెప్పులు కనిపించకపోవడంతో బాల్కనీలోకి వెళ్లగా.. అక్కడ అనిల్ లేకపోవడంతో అటు ఇటు చూసి కిందకి చూడగానే.. అప్పటికే  కింద వాచ్ మెన్ సహాయం కోసం గట్టిగా అరుస్తూ ఉన్నట్లు తెలిపింది. అనిల్ కు ఎలాంటి జబ్బు కూడా లేవని. గతేడాది మోకాళ్ళలో నొప్పి కారణంగా  అనిల్ ఇండియన్ మర్చంట్ నేవీ నుంచి VRS తీసుకున్నారని చెప్పారు. అనిల్, తాను కొన్నేళ్ల క్రితమే విడాకులు తీసుకున్నామని, అయితే మళ్ళీ కొన్నేళ్లుగా కలిసి జీవిస్తున్నామని అనిల్ భార్య జాయిస్ తెలిపారు.

అనిల్ అరోరా 

అనిల్ అరోరా పంజాబీ హిందూ కుటుంబానికి చెందినవారు. ఆయన మలయాళీ క్రిస్టియన్ జాయిస్ పాలీకార్ప్‌ను వివాహం చేసుకున్నారు. అనిల్ అరోరా ఇండియన్ నేవీ మర్చంట్ లో ఉద్యోగిగా పనిచేసేవారు. వీరిద్దరికీ నటి మలైకా అరోరా, అమృత అరోరా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మలైకా 11 ఏళ్ళ వయసులో వీరిద్దరూ విడాకులు తీసుకొని సెపెరేట్ అయ్యారు. విడాకుల తర్వాత మలైకా, అమృత సంరక్షణ తల్లి జాయిస్‌కు తీసుకున్నారు. అయితే విడాకులు తీసుకున్న తర్వాత అనిల్- జాయిస్ మళ్ళీ కొన్నాళ్లుగా కలిసి జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో అనిల్ అరోరా మృతి వారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

malaika arora father22

నటి మలైకా అరోరా అనిల్ అరోరా పెద్ద కుమార్తె. ఈమె బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. మోడలింగ్, టీవీ ప్రజెంటర్ గా కెరీర్ మొదలు పెట్టిన అరోరా.. ఆ తర్వాత హిందీ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది.

malaika

కాంటే, EMI వంటి బాలీవుడ్ సినిమాల్లో మలైకా హీరోయిన్ గా కనిపించింది. మలైకాకు 1998లో అర్బాజ్ ఖాన్ తో పెళ్లి జరిగింది. వీరిద్దరికీ ఒక కుమారుడు కూడా ఉన్నాడు. 18 ఏళ్ళ పాటు కలిసి ఉన్న వీరిద్దరూ 2017లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత మలైకా బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ తో డేటింగ్ ఉన్నట్లు అనేక వార్తలు వచ్చాయి.

malaika 1

మలైకా నటించిన చాలా సినిమాల్లో ఆమె మెయిన్ లీడ్ కంటే కూడా క్యామియో రోల్స్, స్పెషల్ సాంగ్స్ లోనే ఎక్కువగా కనిపించింది. హిందీలో ‘చయ్య చయ్య’, “మున్నీ బద్నామ్ హుయ్”, ''మా తుజే సలాం'' వంటి స్పెషల్ సాంగ్ తో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. తెలుగులో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలో ''కెవ్వు కేక'' ఐటం సాంగ్ లో మెరిసింది.

Also Read :  మనవాళ్ల రికార్డ్ అద్భుతం అంతే..ముగిసిన పారాలింపిక్స్

Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe