Malaika Arora: నేను అలసిపోయాను.. ఆత్మహత్యకు ముందు అనిల్ చివరి మాటలు!

మలైకా అరోరా తండ్రి అనిల్ మెహతా ఆత్మహత్యకు ముందు తన కూతుళ్ళతో ఫోన్ లో మాట్లాడినట్లు తెలుస్తోంది. తన ఇద్దరు కూతుళ్ళు మలైకా, అమృతతో.. "తాను అనారోగ్యంతో అలసిపోయానని" చెప్పినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.

malaika arora father

malaika arora father

New Update

Malaika Arora: బాలీవుడ్ ప్రముఖ నటి మలైకా అరోరా తండ్రి అనిల్ మెహతా మరణం ఆమె కుటుంబాన్ని తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. అనిల్ మెహతా ఆత్మహత్య చేసుకోవడం బాలీవుడ్ ఇండస్ట్రీని కలచివేసింది. ఈ వార్త తెలియగానే మలైకా అర్జున్ కపూర్, సలీం ఖాన్, కాజోల్, మాజీ భర్త అర్బాజ్ ఖాన్ సహా పలువురు సినీ తారలు మలైకా కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చారు. అనిల్ మెహతా అంత్యక్రియలు శాంతా క్రజ్ లోని స్మశానవాటికలో హిందూ ఆచారాల ప్రకారం నేడు జరగనున్నాయి. అనిల్ ఆత్మహత్యకు సంబంధించిన గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మలైకా తండ్రి చివరి మాటలు

ఇది ఇలా ఉంటే ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తన ఇద్దరు కూతుళ్లతో మాట్లాడారని, వారితో కొన్ని బాధాకరమైన మాటలు మాట్లాడారని పలు నివేదికలు చెబుతున్నాయి. ఆజ్ తక్ నివేదిక ప్రకారం.. అనిల్ మెహతా ఆత్మహత్యకు ముందు బుధవారం ఉదయం తన ఇద్దరు కుమార్తెలు మలైకా, అమృతతో ఫోన్ లో మాట్లాడారు. కుమార్తెలిద్దరితో తాను అనారోగ్యంతో బాధపడుతున్నాని.. అనారోగ్యంతో అలసిపోయానని తన భాదను చెప్పుకున్నాడు. ఆ తర్వాత బాల్కనీలోకి వెళ్లిన అనిల్ ఇంటి ఏడో అంతస్థు పై నుంచి దూకి తన జీవితాన్ని ముగించినట్లు సమాచారం.

ఇంటి పై నుంచి దూకి ఆత్మహత్య 

ప్రాథమిక సమాచారం ప్రకారం.. అనిల్ మెహతా ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఆయన భార్య జాయిస్ ఇంట్లోనే ఉన్నారు. భర్త అనిల్ తనకు ఉదయం హలో చెప్పడానికి రాకపోవడంతో.. జాయిస్ ఆయన గదిలోకి వెళ్లి చూసింది. గదిలో కూడా జాయిస్ కనిపించకపోవడంతో బాల్కనీలోకి వెళ్ళింది. అప్పటికే బిల్డింగ్ కింద నుంచి వ్యాచ్మెన్ గట్టిగా సహాయం కోసం అరుస్తూ ఉన్నట్లుగా తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇంట్లోని అందరి వాంగ్మూలాలను నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

ఇది ఇలా ఉంటే మలైకా తన తండ్రి మరణం తర్వాత సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ అందరినీ భావోద్వేగానికి గురిచేసింది. తమ తండ్రిని కోల్పోవడం చాలా భాదను కలిగించిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఆయన చాలా సున్నితమైన వ్యక్తి.. ప్రేమగల భర్త, మా బెస్ట్ ఫ్రెండ్ అని. ఆయన మరణం మా కుటుంబాన్నీ తీవ్ర దిగ్బ్రాంతి గురిచేసిందని ఎమోషనల్ అయ్యింది.

Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe