"KA" Movie: స్టార్ హీరో చేతికి.. 'క' మూవీ మలయాళ థియేట్రికల్ రైట్స్‌..!

పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందుతున్న కిరణ్ అబ్బవరం 'క' మూవీ మలయాళ థియేట్రికల్ రైట్స్‌ హీరో దుల్కర్ సల్మాన్ సొంతం చేసుకున్నారు. దుల్కర్ ప్రొడక్షన్ కంపెనీ వేఫేరర్ ఫిల్మ్స్ 'క' మలయాళ వెర్షన్ ను వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనుంది.

KA movie
New Update

"KA" Movie: టాలీవుడ్ యంగ్ హీరో అబ్బవరం నటిస్తున్న లేటెస్ట్ పీరియాడిక్ థ్రిల్లర్ 'క'. 1970లో ఏపీలోని కృష్ణగిరి అనే గ్రామం నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ చిత్రం ఉండబోతుంది. సుజిత్, సుదీప్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీ చక్ర ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై చింత గోపాలకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ తాన్వి, నయన్ సారిక ఫీమేల్ లీడ్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన హీరో ఫస్ట్ లుక్, ఇంట్రో సాంగ్ 'వరల్డ్ ఆఫ్ వాసుదేవ్' హ్యుజ్ రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి.

దుల్కర్ సల్మాన్ చేతికి మలయాళ థియేట్రికల్ రైట్స్

కిరణ్ అబ్బవరం తొలి పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా వివిధ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ మూవీ మలయాళ థియేట్రికల్ రైట్స్ ను మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సొంతం చేసుకున్నారు. దుల్కర్ ప్రొడక్షన్ కంపెనీ వేఫేరర్ ఫిల్మ్స్ 'క' మలయాళ వెర్షన్ ను వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేయనుంది. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. 'క' మూవీ టీజర్, కంటెంట్ తో ఇంప్రెస్ అయిన దుల్కర్ తమ ప్రొడక్షన్ కంపెనీ ద్వారా మలయాళంలో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ ను నిర్మాత వంశీ నందపాటి సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో బిజీగా ఉన్న ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. 

Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe