Bigg Boss 8 Telugu: డేంజర్ జోన్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్..!

బిగ్ బాస్ సీజన్ 8లో రెండవ వారం వచ్చేసింది. ఇక ఈ వారం ఎలిమినేట్ కాబోయే కంటెస్టెంట్ ఎవరనే దానిపై సోషల్ మీడియాలో తెగ చర్చలు జరుగుతున్నాయి. ఊహించని విధంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా భావించిన పృథ్వీ ఎలిమినేట్ కానున్నట్లు టాక్ వినిపిస్తోంది.

bigg boss 8

bigg boss 8

New Update

Bigg Boss Telugu: తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఆసక్తికరంగా కొనసాగుతోంది. అప్పుడే మొదటి వారం పూర్తయి రెండవ వారం కూడా వచ్చేసింది. ఇక వీకెండ్ వచ్చిందంటే ఎలిమినేషన్ డే కూడా వచ్చినట్లే. ఈ వారం మొత్తం 8 మంది కంటెస్టెంట్స్ ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు నామినేట్ అయ్యారు. ఆదిత్య ఓం, శేఖర్ భాషా, నిఖిల్, పృథ్వీ రాజ్, సీత, విష్ణుప్రియ, నైనికా, నాగ మణికంఠ నామినేషన్స్ లో ఉన్నారు. ఇక ఈ ఎనిమిది మందిలో రెండో వారం బిగ్ బాస్ కు గుడ్ బాయ్ చెప్పేది ఎవరా? అని ప్రేక్షకులను ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

డేంజర్ జోన్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్

అయితే ఈ వారం ఎలిమినేషన్ కు సంబంధించి సోషల్ మీడియాలోనూ చాలా రకాల చర్చలు వినిపిస్తున్నాయి. కొంతమంది రివ్యూవర్స్ మాత్రం ఇప్పటి వరకు స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా భావించిన వాళ్ళు కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. అందులో సీరియల్ యాక్టర్  పృథ్వీ రాజ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అయితే ఆన్ లైన్ ఓటింగ్ పోల్స్ ప్రకారం ఆదిత్య ఓం లీస్టులో ఉన్నప్పటికీ.. పృథ్వీ కూడా అదే ఎడ్జ్ లో ఉండడంతో ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు ప్రేక్షకులు భావిస్తున్నారు.

ఈ వారం పృథ్వీ ఆడిన ఆట తీరు కూడా తన ఊహించని ఎలిమినేషన్ కు కారణమయ్యే ఛాన్స్ ఉంది. టాస్క్ లో ఎక్కువగా అగ్రెసివ్ అయిపోవడం.. తాను గెలవడం పక్కన పెట్టి..   పక్కవాళ్ళ ఆటను ఎలా చెడగొట్టాలి అనే దానిపైనే ఎక్కువగా ఫోకస్ చేసినట్లుగా ప్రేక్షకులకు అనిపించింది. ఇవన్నీ తనకు నెగటివ్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ఈ వారం పృథ్వీ కూడా డేంజర్ జోన్ లో ఉండే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ఇక విష్ణుప్రియ, శేఖర్ భాషా, నైనికా ఈ వారం పెద్దగా పర్ఫామ్ చేయనప్పటికీ ... ఆల్రెడీ వాళ్ళకు సోషల్ మీడియాలో క్రియేట్ అయిన బజ్ తో సేవ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంతేకాదు సోనియా- విష్ణు ప్రియా గొడవ విషయంలో కూడా..  విష్ణు ప్రియా పై కొంత వరకు  సాఫ్ట్ కార్నర్ క్రియేట్ అయ్యింది. దీని వల్ల కూడా తన ఓటింగ్ గ్రాఫ్ పెరిగే ఛాన్స్ ఉంది.

Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe