Bangalore Rave Party : రేవ్ పార్టీ కేసులో.. నటి హేమకు బిగ్ షాక్!

బెంగుళూర్ రేవ్ పార్టీ కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. తాజాగా నటి హేమ బెంగళూరు రేవు పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారని పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె ఎండీఎంఏ తీసుకున్నట్లుగా ఆధారాలు సేకరించి మెడికల్ రిపోర్టులను కూడా జత చేశారు.

hema

hema

New Update

Actress Hema : బెంగుళూర్ రేవ్ పార్టీ (Bangalore Rave Party) కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. తాజాగా నటి హేమ (Hema) బెంగళూరు రేవు పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారని పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె ఎండీఎంఏ తీసుకున్నట్లుగా ఆధారాలు సేకరించి మెడికల్ రిపోర్టులను కూడా జత చేశారు. ఇప్పటికే ఈ కేసులో మొత్తం 88 మంది నిందితులను చేర్చారు. ఈ కేసుకు సంబంధించి బెంగళూర్ పోలీసులు 1,086 పేజీల ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు.

ఇటీవలే బెయిల్ పై బయటకు 

ఇది ఇలా ఉండగా.. బెంగళూర్ రేవు పార్టీలో హేమ డ్రగ్స్ (Drugs) తీసుకున్నారనే అబియోగంతో ఆమె పై కేసు నమోదు చేయగా.. నటి హేమ మాత్రం తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని, కేసు నుంచి తనకు మినహాహింపు ఇవ్వాలని బెంగళూర్ కోర్టును ఆశ్రయించింది. దీంతో ఇరు పక్షాల వాదోపవాదనలు విన్న కోర్టు హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో మళ్ళీ రేవు పార్టీ కేసులో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు ఇచ్చిన స్టేట్మెంట్ సంచలనంగా మారింది.

నేను డ్రగ్స్ తీసుకోలేదు 

అయితే తాజాగా నటి హేమ బెంగళూర్ రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో ఆమె పేరును ఛార్జ్ షీట్ చేర్చడం పై స్పందించారు. తాను ఎక్కడ కూడా డ్రగ్స్ తీసుకోలేదని తెలిపింది. బెంగళూర్ పోలీసులు నమోదు చేసిన ఛార్జ్ షీట్ లో తన పేరు వచ్చినట్లు తెలిసిందని.. ఒకవేళ తాను డ్రగ్స్ తీసుకున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం అని చెప్పింది. ఛార్జ్ షీట్ తనకు వచ్చాక దీనిపై స్పందిస్తానని తెలిపింది. ఆమెకు వచ్చిన సమాచారం ప్రకారం డ్రగ్స్ రిపోర్ట్ లో నెగటివ్ వచ్చినట్లుగా ఛార్జ్ షీట్ లో ఫైల్ అయినట్లు తెలుస్తుందని అన్నారు. చివరిగా నటి హేమ తాను   MDMA తీసుకోలేదని క్లారిటీ ఇచ్చింది. 

బెంగళూర్ రేవు పార్టీకీ సంబంధించి MAA సభ్యత్వం నుంచి ఆమెను తొలగించగా.. ఇటీవలే ఆమె సస్పెన్షన్ రద్దు చేస్తున్నట్లు MAA అసోసియేషన్, ప్రెసిడెంట్ మంచు విష్ణు లేఖను రిలీజ్ చేశారు. దీంతో హేమకు కాస్త ఊరట లభించింది.  

Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe