Viral Video : కూటమి ఎమ్మెల్యేల భేటీలో ఆసక్తికర పరిణామం.. ఆ కుర్చీ మార్పించిన చంద్రబాబు! ఈ రోజు విజయవాడలో నిర్వహించిన ఎన్డీఏ ఎమ్మెల్యేల భేటీలో చంద్రబాబుకు నేతలు ప్రత్యేక కుర్చీ వేశారు. అయితే.. చంద్రబాబు వేదికపైకి రాగానే తన సిబ్బందికి చెప్పి ఆ కుర్చీని మార్పించారు. పురంధేశ్వరి, పవన్ కల్యాణ్ కూర్చున్న లాంటి కుర్చీనే తన కోసం తెప్పించుకున్నారు. By Nikhil 11 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Vijayawada : ఈ రోజు విజయవాడలో జరిగిన ఏపీ ఎన్డీఏ (NDA) ఎమ్మెల్యేల భేటీలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వేధికపై చంద్రబాబు (Chandrababu), పవన్ కల్యాణ్ (Pawan Kalyan), పురంధేశ్వరి (Purandeswari), ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కోసం కుర్చీలు ఏర్పాటు చేశారు. అయితే.. చంద్రబాబు కోసం పసుపు టవల్ వేసిన ప్రత్యేకమైన కుర్చీని ఏర్పాటు చేశారు నాయకులు. అయితే.. చంద్రబాబు సిబ్బందిని పిలిచి తనకు కూడా అందరి లాంటి కుర్చీని వేయాలని సూచించారు. దీంతో సిబ్బంది చంద్రబాబు కుర్చీని మార్చారు. పురంధేశ్వరి, పవన్ కల్యాణ్, అచ్చెన్నాయుకు వేసిన లాంటి కుర్చీనే చంద్రబాబు కోసం తీసుకువచ్చారు. దీంతో చంద్రబాబు ఆ కుర్చీపై కూర్చున్నారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చంద్రబాబు సంస్కారం అంటూ టీడీపీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. కూటమి నేతలు పవన్ కళ్యాణ్ కి పురందేశ్వరి కి గౌరవం ఇస్తూ, తనకు వేసిన ప్రత్యేకమైన కుర్చీని వద్దని, వాళ్ళు కూర్చున్న కుర్చీ లాంటిదే తెమ్మని చెప్పిన చంద్రబాబు .@ncbn @JaiTDP @PawanKalyan @PurandeswariBJP #meeting #RTV pic.twitter.com/FnBccuVsvC — RTV (@RTVnewsnetwork) June 11, 2024 కూటమి ఎమ్మెల్యేల భేటీ సందర్భంగా చంద్రబాబు జనసేన, బీజేపీ నేతలను ప్రశంసంలతో ముంచెత్తారు. కూటమి ఏర్పడటానికి పవన్ చాలా కృషి చేశారని కొనియాడారు. బీజేపీ కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చిందన్నారు. ఇంతటి కష్టం తానెప్పుడూ చూడలేదన్నారు. అందుకే ఈ భారీ విజయం సాధ్యమైందన్నారు. రాష్ట్రానికి కేంద్రం సాయం చాలా అవసరం అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి మోదీ హామీ ఇచ్చారని తెలిపారు. Also Read : బాబు, పవన్ ప్రమాణ స్వీకారానికి చిరంజీవి! #bjp-purandeswari #chandrababu #nda #pawan-kalyan #ap-tdp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి