భగ్గుమంటున్న టమోటా ధరలు..కిలో టమోటా ధర ఎంతంటే...!!

టమోటా లేని కూరను ఊహించలేము. ప్రతి కూరలో తప్పనిసరిగా టమోటాను వాడుతుంటాం. టమోటా లేకుంటే కూరకు రుచే ఉండదు. అందుకే టమోటాకు చాలా డిమాండ్ ఉంటుంది. వేసవిలోనూ తక్కువ ధరకే అందుబాటులో ఉన్న టమోటా ధరలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా భగ్గమంటున్నాయి. అత్యధిక మార్కెట్లలో కిలో టమోటా ధర రూ. 100పైగానే పలుకుతోంది. హోల్ సెల్ మార్కెట్లలో 65 నుంచి 70 మధ్య లభిస్తున్నాయి. వారం క్రితం వరకు హోల్ మార్కెట్లలో 30నుంచి 35 పలికన టమోటా ధరలు రిటైల్ మార్కెట్లో 40 నుంచి 50 మధ్య లభించాయి. కానీ రుతుపవనాలు ఆలస్యంగా రావడంతో రిటైల్ మార్కెట్లో కిలో టమోటా ధరలు భారీగా పెరిగాయి.

author-image
By Bhoomi
New Update
భగ్గుమంటున్న టమోటా ధరలు..కిలో టమోటా ధర ఎంతంటే...!!

దేశంలో టమోటా ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో టమోటా ధర రూ. 100కిపైగానే విక్రయిస్తున్నారు. ఆదివారం కిలో టమోటా ధర రూ. 80 ఉండగా..ఒక్క రోజులోనే రూ. 20పెరిగింది. సాధారణంగా టమాటా కిలో రూ. 20 నుంచి రూ.40 వరకు విక్రయిస్తారు. అయితే గతవారం రోజులుగా క్రమంగా ధర పెరుగుతుండటంతో గత వారం 50కి చేరింది. ప్రస్తుతం కిలో టమోటా ధర 100 పలుకుతోంది. స్థానికంగా పంటలు లేకపోవడమే టమోటా ధర పెరగడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు.

TAMOTO PRICE

గత నెలలో యూపీ, మహారాష్ట్రలతోపాటు దేశవ్యాప్తంగా కిలో టమోటా ధర రూ. 2 , 5 మధ్య పలికింది. కానీ ఇప్పుడు కిలో టమోటా ధర కేవలం నెల రోజుల్లో 1900రెట్లకు పైగా పెరిగింది. ఢిల్లీ మార్కెట్లలో కిలో టమోటా ధర ఇప్పుడు 70 నుంచి 100రూపాయల మధ్య విక్రయిస్తున్నారు. మధ్యప్రదేశ్, యూపీ రాష్ట్రాల్లో 80 నుంచి 100రూపాయల మధ్య విక్రయిస్తుండగా...రాజస్ధాన్ లో 90 నుంచి 110 రూపాయలు పలుకుతోంది. పంజాబ్ లో 60 నుంచి 80 రూపాయలకు లభిస్తున్నాయి.

పలు రాష్ట్రాల్లో అకాల వర్షం కారణంగా టమోటా పంటలు చాలా వరకు దెబ్బతిన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వేడి గాలుల వల్ల దిగుబడి చాలా వరకు తగ్గింది. ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి టమోటా ధరలు భారీగా తగ్గిపోయింది. అంతేకాదు గతంతో పోలిస్తే రైతులు టమోటా సాగు తగ్గించినట్లు తెలుస్తోంది.

హర్యానా, యూపీ రాష్ట్రాల నుంచి టమోటా సరఫరా తగ్గడంతో వారంలో హోల్ సేల్ మార్కెట్లలో ధరలు రెట్టింపు అయ్యాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి రవాణా ఖర్చులు పెరగడం వల్ల కూడా ధరలు పెరిగినట్లు చెబుతున్నారు. మధ్యప్రదేశ్, ఏపీ, కర్నాటక, తమిళనాడు, గుజరాత్, ఒడిశా రాష్ట్రాల్లో టమోటాలు ఎక్కువగా పండిస్తారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు