యూపీలో ఘోరం, ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దారుణ హత్య..!!

యూపీలో ఘోరం జరిగింది. మెయిన్‌పురిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనకు పాల్పడ్డ నిందితుడు కుటుంబ సభ్యులను చంపి..తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని..వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

New Update
యూపీలో ఘోరం, ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దారుణ హత్య..!!

ఉత్తరప్రదేశ్ లోని మెయిన్ పురిలో దారుణ హత్య కలకలం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన 6గురు వ్యక్తులను కిరాతకంగా హత్య చేశాడో వ్యక్తి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...మెయిన్ పురిలోని ఓ ఇంట్లో పెళ్లి ఉండటంతో..కుటుంబ సభ్యులు, బంధువులంతా ఒకచోటకు చేరారు. అక్కడేం జరిగిందో తెలియదు...నిందితుడు బంధువులు, కుటుంబసభ్యులపై విచక్షణారహితంగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఐదురుగు అక్కడిక్కడే మరణించారు. మరోకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు. ఈఘటనను అడ్డుకునే యత్నించిన మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

mainpuri

అయితే ఈ హత్యలు ఎందుకు చేశారన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు. ఘటనాస్థలానికి ఎస్పీతోపాటు పలువురు ఉన్నాతాధికారులు చేరుకున్నారు. ఈ ఘటన సంబంధించి దర్యాప్తు చేపట్టామని పూర్తివివరాలను వెల్లడిస్తామని తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు