రామయాణంపై RJD ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు..ఫైర్ అవుతోన్న బీజేపీ..!!

హిందూవుల పవిత్ర గ్రంధం అయిన రామాయణంపై ఆర్జేడీ ఎమ్మెల్యే రిట్లాల్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రామచరితమానస్ ను మసీదులో రాశారంటూ సంచలన కామెంట్స్ చేశారు. దీంతో బీహార్ రాజకీయాలు వేడెక్కాయి. రిట్లాల్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ అవుతోంది. నితీష్ కుమార్ నుంచి లాలూ యాదవ్ వరకు అందరినీ టార్గెట్ చేసింది. మంత్రి చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యల దుమారం సద్దుమణుగుతున్న తరుణంలో రిట్లాల్ యాదవ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు బీహార్ రాజకీయాలను వేడెక్కించాయి.

New Update
రామయాణంపై RJD ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు..ఫైర్ అవుతోన్న బీజేపీ..!!

బీహార్‌లో మరోసారి రామచరితమానస్ వివాదంపై రచ్చ మొదలైంది. బీజేపీని కార్నర్ చేసేందుకు ఆర్జేడీ ఎమ్మెల్యే రిత్లాల్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మసీదులో కూర్చొని రామచరితమానస్ రాశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రామచరితమానస్ ను తగలబెట్టాలంటూ అట్టడుగు వర్గాలపై విద్వేషాలను వ్యాప్తి చేసే పుస్తకమంటూ మంత్రి చంద్రశేఖర్ చేసిన కామెంట్స్ సద్దుమణుగుతున్న సమయంలో మరో ఆర్జేడీ ఎమ్మెల్యే ఈ వివాదానికి మరింత ఆజ్యం పోశారు. రిత్లాల్ యాదవ్ కూడా రామాయణంపై సంచలన వ్యాక్యలు చేశారు. పాట్నాలో జరిగిన మీడియా సమావేశంలో రిత్లాల్ మాట్లాడారు. మసీదులో రామచరితమానస్ ను రాశారని...తాను చెప్పింది వాస్తవమో కాదో తెలుసుకునేందుకు చరిత్ర పుస్తకాలు తెచ్చుకుని చెక్ చేసుకోవాలంటూ హాట్ కామెంట్స్ చేశారు.

RJD MLA's controversial comments

బీజేపీ నేతలు ముస్లింలను ద్వేషిస్తున్నారి..హిందూత్వ గురించి మాట్లాడుతున్నారని రిత్లాల్ యాదవ్ అన్నారు. దేశంలోని ముస్లింలందరినీ బీజేపీ తరిమి కొడుతుందని..మసీదలోనే రామచరితమానస్ రాశారు కావాలంటే చరిత్ర ను చెక్ చేసుకోండి అంటూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొఘలులు ఇన్ని సంవత్సరాలు పాలించినప్పుడు హిందుత్వానికి ప్రమాదం లేదా?అంటూ ప్రశ్నించారు. ముస్లిం యువతి భగవత్ కథ చెప్పినప్పుడు ఎవరూ ఏమీ అనలేదని ఆయన అన్నారు. ఆ సమయంలో తనను దేశం నుంచి ఎందుకు బహిష్కరించలేదని ప్రశ్నించారు.

ఎమ్మెల్యే రిట్లాల్ చేసిన వ్యాఖ్యలపై ఆర్జేడీ విరుచుకుపడింది. జేడీయూ అధికార ప్రతినిధి అభిషేక్ ఝా స్పందిస్తూ...ఇలాంటి ప్రకటనలు ప్రజలకు తప్పుడు సందేశాన్ని పంపుతాయన్నారు. ఇలాంటి వ్యాఖ్యలుకు దూరంగా ఉండాలని... మతం అనేది ప్రజల వ్యక్తిగత విషయమంటూ వార్నింగ్ ఇచ్చారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు