మహేశ్ అభిమానులకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఘట్టమనేని వారసుడు ఎంట్రీ తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో స్టార్ కిడ్ ఎంట్రీ ఖాయమైంది. అయితే కొద్దిగా టైం పడుతుంది. ఇప్పటికే నందమూరి, మెగా, అక్కినేని, దగ్గుబాటి కుటుంబాల నుంచి మూడో తరం హీరోలుగా రాణిస్తున్నారు. తాజాగా ఘట్టమనేని కుటుంబం నుంచి మూడో తరం వారసుడు రాబోతున్నాడు. దీనిపై ఆ ఫ్యామిలీ నుంచి క్లారిటీ కూడా వచ్చేసింది. By BalaMurali Krishna 16 Jul 2023 in సినిమా Scrolling New Update షేర్ చేయండి దివంగత సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా సినిమాల్లోకి మహేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అనంతరం తన నటనతో కోట్లాది మంది అభిమానులకు ప్రిన్స్‌గా మారారు. స్టార్ హీరోగా కొనసాగుతూ తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. మహేష్ కుమారుడు గౌతమ్ కూడా '1' నేనొక్కడినే సినిమాలో నటించాడు. తర్వాత చదువుపై దృష్టి పెట్టి నటనకు దూరం అయ్యాడు. అయితే గౌతమ్ హీరోగా ఎంట్రీ ఇవ్వాలని ఘట్టమనేని అభిమానులు ఆశిస్తున్నారు. సినిమాల్లోకి గౌతమ్ ఎంట్రీ ఖాయం.. అభిమానుల ఆశలపై మహేష్ సతీమణి నమ్రత స్పందించారు. త్వరలోనే గౌతమ్ సినిమాల్లోకి వస్తాడని గుడ్ న్యూస్ చెప్పారు. అయితే ప్రస్తుతం చదువుకుంటున్న గౌతమ్.. సినిమాల్లోకి రావడానికి ఏడెనిమిది సంవత్సరాలు పడుతుందని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం గౌతమ్ వయస్సు 16 సంవత్సరాలు మాత్రమే. దాంతో డిగ్రీ కంప్లీట్ చేసి పాతికేళ్ల లోపు మూవీలోకి ఎంట్రీ ఇస్తాడని నమత్ర ఉద్దేశం. ఏది ఏమైనా కానీ తమ లిటిల్ సూపర్ స్టార్ సినిమాల్లో హీరోగా రావడం ఖాయం కావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సితార కూడా మూవీల్లోకి వచ్చే అవకాశం.. మరోవైపు మహేష్ గారాల పట్టి సితార కూడా రోజురోజుకి ఫాలోయింగ్ సంపాదించుకుంటుంది. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ, డ్యాన్స్‌లు చేస్తూ ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. దీంతో ఆమె క్రేజీని క్యాష్ చేసుకునేందుకు కార్పొరేట్ సంస్థలు ముందుకొస్తున్నాయి. ఇటీవలే ఓ జ్యువెలరీ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా సితారను నియమించుకుని రూ.2కోట్లు పారితోషికం కూడా అందజేశారు. దీంతో తనకు కూడా నటనపై ఇంట్రస్ట్ ఉండటంతో ఆమె కూడా సినిమాల్లోకి రానుంది. మొత్తానికి మహేష్ వారసులిద్దరూ సినిమాల్లోకి రానుండడంతో ఫ్యాన్స్‌కు డబుల్ కిక్ ఇవ్వనుంది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి