ఈశాన్య రాష్ట్రం మణిపూర్ హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా మణిపూర్ లో గురువారం హైడ్రామా జరిగింది. రాష్ట్ర రాజధాని ఇంఫాన్ నుంచి రాహుల్ గాంధీ రోడ్డు మార్గంలో వెళ్తుండగా…ఇంఫాల్ కు 20 కిలోమీటర్ల దూరంలో రాహుల్ కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకన్నారు. చురాచాంద్ పూర్ జిల్లాలో రాహుల్ పర్యటించాల్సి ఉంది. అయితే ఆ ప్రాంతం అల్లర్లతో అట్టుడుకుతుంది.
పూర్తిగా చదవండి..మణిపూర్‌లో మళ్లీ కాల్పులు… రాహుల్ గాంధీ పర్యటనకు బ్రేక్
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ అట్టుడుకుతోన్న విషయం తెలిసిందే. కొన్నాళ్లుగా రెండు జాతుల మధ్య దాడులతో హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మణిపూర్ లో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు మణిపూర్ లో చేరుకున్నారు. అయితే రాహుల్ గాంధీ కాన్వాయ్ ను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. బిష్ణుపూర్ వద్ద పరిస్థితులు సరిగ్గాలేవని..రోడ్డు మార్గంలో కాకుండా హెలికాప్టర్ లో వెళ్లాలని రాహుల్ గాంధీకి సూచించారు. రాహుల్ పర్యటించే ప్రాంతంలో బుధవారం అల్లర్లు జరిగాయి. అక్కడ పరిస్థితి అదుపులో లేదు. ఈ సమయంలో రాహుల్ అక్కడ పర్యటించడం బాగుండదని..ఆలోచను మానుకోవాలని పోలీసులు కోరారు. దీంతో రాహుల్ పర్యటనను వాయిదా వేసుకుని ఇంఫాల్ కు తిరుగుపయనమయ్యారు.

Translate this News: