నేటి యువత ఉద్యోగాల కన్నా వ్యాపారం వైపే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే వ్యాపారాల గురించి సెర్చ్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో చాలా మంది ఉద్యోగాలకు గుడ్ బై చెప్పి వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు. ఉన్న ఊరిలో…కొద్దిపాటి భూమిలో వ్యవసాయం సాగు చేస్తూ లక్షలు ఆర్జిస్తున్నారు. అలాంటి వారికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సాయం కూడా అందిస్తోంది. ముద్ర స్కీం ద్వారా రూ. 50 వేల నుంచి రూ. 10లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తోంది. అంతేకాదు కొన్నిప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు కూడా రుణాన్ని అందిస్తున్నాయి. ఈ ఏపిసోడ్ లో మేము మీకు అద్భుతమైన వ్యవసాయం గురించి చెప్పబోతున్నాం. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించే వ్యాపారం. అదేంటో చూద్దాం.
దేశంలో రైతుల భవిష్యత్తుకు భద్రత కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో అద్భుతమైన పథకాలు అమలు చేస్తున్నాయి. అయితే చాలా మంది రైతులు ఇప్పుడు సంప్రదాయ వ్యవసాయం చేసేందుకు ఇష్టపడుతున్నారు. పెట్టుబడి తక్కువ, లాభాలు ఎక్కువగా ఉండే వ్యాపారం వైపు అడుగులు వేస్తున్నారు. అలాంటి వ్యాపారాల్లో ఒకటి జ్యూట్ వ్యవసాయం. ఇటీవల భారత ప్రభుత్వం జనపనార సాగు విస్తీర్ణం పెంచడానికి, రైతులకు మంచి ధరలు పొందడానికి జూట్ ధరలను పెంచింది. అటువంటి పరిస్థితిలో, రైతులు జూట్ సాగు ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు. గోధుమలు, ఆవాలు పండించిన తర్వాత మార్చి, ఏప్రిల్ నెలల్లో జనపనార సాగు చేస్తుంటారు. ఒండ్రు ఇసుకతో కూడిన నేల, మంచి లోతు గల ఒండ్రు నేలలు, బంకమట్టి నేలలు జనపనార సాగుకు అత్యంత అనుకూలమైనవి. జనపనార గింజలు చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి సీడ్ బెడ్లో చక్కటి ఒంపు ఉండాలి. ఈ జనపనార వర్షాధార పంట. తేమతో కూడిన వాతావరణంలో ఏపుగా పెరుగుతుంది. ఖరీఫ్ లో ఏపుగా పెరుగుదల ఉన్నందున ఖరీఫ్ లేదా వర్షాకాలంలో పండిస్తారు.
మొక్క నుంచి పీచును సేకరించి మందపాటి దారంలా తయారు చేస్తారు. ధాన్యం ప్యాక్ చేసేందుకు ఉపయోగించే బస్తాలను జ్యూట్ తోనే తయారు చేస్తారు. జ్యూట్ బస్తాలు మాత్రమే కాదు..అనేక రకాల అలంకరణ వస్తువులు కూడా దీని సహాయంతో తయారు చేస్తారు. రగ్గులు, దుప్పట్లు తయారీలో కూడా జనపనార ఫైబర్ ఉపయోగిస్తారు. అంతేకాదు తక్కువ గ్రేడ్ కాగితం తయారీలోనూ ఉపయోగిస్తారు. చార్ కోల్ లో జనపనారా వ్యార్థాలను ఇంధనంగా ఉపయోగిస్తారు. జనపనారతోపాటు వాటి ఆకు కూడా ఔషధగుణాలను కలిగి ఉంటాయి.
మన దేశంలో తూర్పు ప్రాంతంలో రైతులు పెద్ద ఎత్తున జనపనారను సాగు చేస్తారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జూట్ ధరలను 6 శాతం పెంచింది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు జూట్‌ను సాగు చేయడం ద్వారా మంచి లాభాలను ఆర్జించవచ్చు. జూట్ సాగు రైతులకు సంపాదించడానికి గొప్ప ఎంపికగా మారుతుంది. ప్రపంచంలో 50శాతం జనపనార ఉత్పత్తి భారత్ లోనే అవుతుంది. అయితే ఈ వ్యాపారం ప్రారంభించేందుకు కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ సాయం అందిస్తోంది. ముద్రా స్కీం ద్వారా లోన్ తీసుకుని ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.