చంద్రయాన్-3 ప్రయోగానికి సర్వం సిద్ధం.. ఈసారి చరిత్ర సృష్టించేందుకు ఇస్రో రెడీ చంద్రయాన్-3 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. ఇప్పటికే కౌంట్ డౌన్ కూడా స్టార్ అయింది. ఇంకొన్ని గంటల్లోనే బాహుబలి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. చంద్రయాన్-2 ప్రయోగంలో జరిగిన పొరపాట్లు జరగకుండా ఉండేలా అన్ని జాగ్రత్తలు ఇస్రో తీసుకుంది. ఈసారి ఎలాగైనా జాబిల్లిపై కాలు మోపేందుకు రెడీ అయింది. By Bhoomi 13 Jul 2023 in నేషనల్ Scrolling New Update షేర్ చేయండి 25గంటల కౌంట్ డౌన్ షురూ.. యావత్ భారతదేశం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న చంద్రయాన్-3 ప్రయోగానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. దాదాపు 25గంటల పాటు కౌంట్ డౌన్ సాగనునుంది. శుక్రవారం మధ్యాహ్నం 2:35:13 నిమిషాలకు బాహుబలి రాకెట్ ఎల్‌వీఎం-3ఎం4 నింగిలోకి దూసుకెళ్లనుంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్(షార్)లో ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈసారి ఎలాగైనా చంద్రుడి జాడ కనిపెట్టాలని ఇస్రో శాస్త్రవేత్తలు గట్టి పట్టుదలతో ఉన్నారు. 3,84,000 కిలోమీటర్లు ప్రయాణం.. LVM-3M4 ఉపగ్రహాన్ని ల్యాండర్, రోవర్ ప్రొపల్షన్ మాడ్యూల్ తో అనుసంధానించారు. భూమ్మీద నుంచి సుమారు 3,84,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి చంద్రుడి కక్ష్యలోకి చేరుకోనుంది. అనంతరం చంద్రగ్రహంపై ఉన్న దక్షిణ ధ్రువంలోని నిర్దేశిత ప్రదేశంలో ల్యాండ్ అవ్వనుంది. నాలుగేళ్ల క్రితం చంద్రయాన్ 2లో ప్రయోగించిన ఆర్బిటర్ చంద్రుడి చుట్టూ తిరుగుతుండడంతో దాన్ని ఇప్పుడు వినియోగించుకోన్నుట్లు ఇస్రో ప్రకటించింది. గత వైఫల్యాన్ని అధిగమించేలా.. ఈసారి ఎలాగైనా చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ కోసం అన్ని చర్యలు తీసుకున్నట్లు ఇస్రో వెల్లడించింది. గత వైఫల్యంపై రివ్యూ చేసి దాన్ని అధిగమించేలా ఫెయిల్యూర్ బేస్డ్ డిజైన్ ని రూపొందించామని తెలిపింది. ఏమైనా అనుకోని సమస్యలు ఎదురైనా రాకెట్ విజయవంతంగా చంద్రుడిపై దిగేలా కసరత్తు చేపట్టింది. చంద్రయాన్3లో ఇంధన పరిణామం పెంచడంతో ప్రత్యామ్నాయ ల్యాండింగ్ ప్రదేశానికి చేరుకోగలదని పేర్కొంది. దక్షిణ ధ్రువంలోనే ల్యాండింగ్ ఎందుకు? ఇప్పటిదాకా చంద్రుడిపైకి వెళ్లిన వ్యోమనౌకలు ఎక్కువగా మధ్య రేఖా ప్రాంతంలోనే దిగాయి. కానీ ఇస్రో మాత్రం ఇందుకు భిన్నంగా దక్షిణ ధ్రువ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకుంది. దీని వెనక బలమైన కారణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అక్కడ ల్యాండిగ్ చేస్తే విశ్వం ఆవిర్భావం గురించి కొత్త విషయాలు తెలుసుకునే అవకాశాలున్నాయని పేర్కొంటున్నారు. అక్కడి పురాతన శిలలపై పరిశోధనలు జరపడం ద్వారా విశ్వ ఆవిర్భావం గురించి కొత్త వివరాలు తెలుసుకోవచ్చంటున్నారు. ఈసారి విజయం దిశగా అడుగులు.. 2008లో చంద్రయాన్-1 ప్రయోగంతో తొలిసారిగా నీటి జాడలు గుర్తించింది ఇస్రో. అనంతరం 2019లో చేపట్టిన చంద్రయాన్- 2 ప్రయోగం చివరి నిమిషంలో ఫెయిల్ అయింది. టెక్నికల్ సమస్య రావడం.. క్రాష్ ల్యాండింగ్ కావడంతో చంద్రుడి జాడను కనిపెట్టలేకపోయాం. ఆ పరాజయం నుంచి పాఠాలు నేర్చుకున్న ఇస్రో ఈసారి ఎలాగైనా చంద్రయాన్- 3 ప్రయోగం ద్వారా జాబిల్లిపై భారత జెండా పాతాలని కృతనిశ్చయంతో ఉంది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి