Pithapuram Varma: ఎన్నికలు అయిపోయాయి. ఓట్ల సునామీ ఈవీఎంలలో ప్రశాంతంగా ఉంది. ఎన్నికల ఫలితాల తుపాను ముందు కొట్లాటల ఈదురుగాలులు గట్టిగానే వచ్చాయి. ఎవరు గెలుస్తారు.. మెజార్టీ ఎంత అనే బెట్టింగుల హోరు తప్ప ప్రస్తుతం తుపాను ముందరి ప్రశాంతతలా పరిస్థితి ఉంది. ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం మాత్రం హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడానికి ముందు మొదలైన ఆ నియోజకవర్గ ఓటర్ల జోరు.. ఎన్నికల ఫలితాలు వచ్చేవరకూ కొనసాగేలానే ఉంది. ఆ నియోజకవర్గం పిఠాపురం. ప్రతి ఎన్నికల ముందు.. ఈ నియోజకవర్గం కాస్త భిన్నంగా వినిపిస్తూ ఉంటుంది. కానీ, ఈసారి దేశమంతా మారుమోగేలా ఈ నియోజకవర్గ ఎన్నికల హంగామా ఉంది. దానికి కారణం జనసేనాని పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పోటీలో ఉండడమే. ఇది అందరికీ తెలిసిందే. అయితే, ఎన్నికల నోటిఫికేషన్ నుంచి నామినేషన్.. ప్రచారం.. ఓటింగ్ సరళి.. అన్నిటిలోనూ పవన్ కళ్యాణ్ వెనుక ఉన్నది.. నడిపించింది మరో శక్తి ఉంది. ఆ శక్తి పేరు ఎస్వీఎస్ఎన్ వర్మ. ఆయనను పవన్ వెనుక ఉన్న శక్తి అనడం విషయంలో ఎవరికీ అభ్యంతరాలు కచ్చితంగా ఉండవు. ఎందుకంటే.. అదే వాస్తవం కనుక. ఈ సత్యనారాయణ వర్మ పిఠాపురం రాజకీయాల్లో సంచలనమైన వ్యక్తి. ఎందుకో ముందు చూద్దాం..
పూర్తిగా చదవండి..Pithapuram Varma: పిఠాపురం వర్మ.. కష్టానికి గుర్తింపు దక్కుతుందా? ఫలితాల పవన్ ఏమి చేస్తారు?
అన్నిటిదీ ఒక లెక్క.. పిఠాపురం నియోజకవర్గానిది మరో లెక్క. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నో పీటముడులు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. పిఠాపురం వర్మ తన సీటును త్యాగం చేసి పవన్ కళ్యాణ్ పోటీకి దారిచ్చారు. మరి భవిష్యత్ లో ఆయన త్యాగానికి గుర్తింపు ఉంటుందా? ఈ విశ్లేషణ చూడండి..
Translate this News: