అమెజాన్ ప్రైమ్ డే సేల్ డేట్స్ లీక్.. అదిరే ప్లాన్స్, మరెన్నో డీల్స్...ఎప్పటి నుంచో తెలుసా..?

అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ షురూ కానుంది. వచ్చే జులై 15-16 తేదీల్లో ఈ సేల్స్ అందుబాటులో ఉండనున్నాయి. ప్రైమ్ మెంబర్లకు మాత్రమే అదిరే ప్లాన్లను అమెజాన్ ప్రకటించింది. ఈ సేల్లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, గృహోపకరణాలు, దుస్తులతోపాటు మరిన్నింటిపై డీల్‌లను అందిస్తుంది.

New Update
అమెజాన్ ప్రైమ్ డే సేల్ డేట్స్ లీక్.. అదిరే ప్లాన్స్, మరెన్నో డీల్స్...ఎప్పటి నుంచో తెలుసా..?

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తమ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు వివిధ రకాల సేల్స్ ను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఈ సేల్స్ ద్వారా అనేక ప్రొడక్ట్స్ పై ఎక్కువ మొత్తంలో డిస్కౌంట్లను అందిస్తుంది. అయితే ఈ అన్ని సేల్స్ ఒక ఎత్తు అయితే...అమెజాన్ ప్రైమ్ డే సేల్ మాత్రం మరొక ఎత్తు అని చెప్పాల్సిందే. ఎందుకంటే అమెజాన్ ఏ ఇతర సేల్స్ లో అందించని అద్బుతమైన డిస్కౌంట్లను ఈ సేల్ లో భాగంగా అందిస్తుంది. ఈ ఏడాది మొత్తంలో అమెజాన్ ఈ సేల్ లోనే భారీ డిస్కౌంట్లను అందించనుంది. అయితే లేటెస్టుగా ఈ సేల్ కు సంబంధించిన తేదీలు వివిధ ఆన్ లైన్ ఫ్లాట్ ఫాంలలో లీక్ అయ్యాయి.

AMAZON PRIME DAY SALE

లీక్ అయిన సమాచారం ప్రకారం..జులై 15న ఈ సేల్ ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈరెండు రోజుల సెల్ అనగా జులై 15, 16 తేదీల్లో అందుబాటులో ఉంటుందని ఆన్ లైన్ ఫ్లాట్ ఫారంలు తెలిపాయి. అయితే ఈ సేల్ గురించి అమెజాన్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. అలాగే ఈ సేల్ కు సంబంధించిన తేదీలను అమెజాన్ త్వరలోనే ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది అమెజాన్ ప్రైమ్ డే సేల్ ను జులై 23, 24 తేదీల్లో నిర్వహించింది.

ఈ సేల్ లో భాగంగా అమెజాన్ స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, హోం అప్లయోన్సెస్, ఫ్యాషన్ తోపాటుగా మరికొన్ని ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్ ను అందించింది. అంతేకాదు గతేడాది ఈ సేల్ లో బ్యాంకు ఆఫర్లను కూడా అమెజాన్ అందించింది. ఎస్బిఐ, ఐసీఐసీఐ బ్యాంకులతో భాగస్వామ్యం కుదుర్చుకుంది అమెజాన్.

అయితే ఈ ఏడాది సేల్ లో కూడా అమెజాన్ ఈ రెండు బ్యాంకులతో భాగస్వామ్యం కుదుర్చుకునే ఛాన్స్ ఉన్నట్లు లీక్స్ ద్వారా తెలుస్తోంది. ఈ సేల్ కేవలం అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ కు మాత్రమే అందుబాటులో ఉండనుంది. ప్రస్తుతం భారత్ లో అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ రూ. 1499కి అందుబాటులో ఉంది. ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకున్న కస్టమర్లకు అమెజాన్ అందించే సేల్ కు ముందుగానే యాక్సిస్ పొందడంతోపాటు ఒకరోజులోనే డెలివరీని అందిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసేవారికి 5శాతం అన్ లిమిటెడ్ క్యాష్ బ్యాక్ ను పొందే ఛాన్స్ ఉంది. నో-కాస్ట్ EMI ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు