R-5 zone in Amaravati: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి(AP Govt) షాక్ ఇచ్చింది హైకోర్టు. ఆర్-5 జోన్ లో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఇళ్ల నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇళ్ల నిర్మాణాన్ని నిలువరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై గురువారం జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజు, జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ రవినాథ్ తిల్హరిలతో కూడిన హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది.
పూర్తిగా చదవండి..ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు స్టే.. అసలు ఇంతకీ ఆర్-5 జోన్ అంటే ఏమిటి?
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, రాజధాని ప్రాంత రైతుల అభ్యంతరాలను కాదని అమరావతిలో స్థానికేతరులకు ఇళ్ల స్థలాలను ఇచ్చేందుకు జగన్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ తోనే ఈ వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. విజయవాడ, గుంటూరు నగరాలకు చెందిన పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రత్యేక జోన్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే సీఆర్డీఏ చట్ట సవరణ చేసిన ప్రభుత్వం, అమరావతి ప్రజా రాజధాని కావాలంటే..
Translate this News: