భారతదేశానికి రెండో రాజధానిహైదరాబాదే

మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశానికి హైదరాబాద్‌ రెండో​ రాజధాని కావాలని ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. అంబేద్కర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేద్కర్‌ కూడా ఇదే చెప్పారని విద్యాసాగర్‌రావు అన్నారు.

New Update
భారతదేశానికి రెండో రాజధానిహైదరాబాదే

VidyasagarRao Commentes in hyderabed

రాజ్యాంగంలో ఈ అంశం ఉంది

కాగా, సీహెచ్‌ విద్యాసాగర్‌ రావు శుక్రవారం మీడియాతో​ మాట్లాడుతూ.. రెండో రాజధానిపై పార్టీలన్నీ నిర్ణయం తీసుకోవాలి. బంగారు తెలంగాణ ఆకాంక్షకు రెండో రాజధాని తోడ్పడుతుంది. భారతదేశానికి హైదరాబాద్ రెండో రాజధాని అయ్యే అవకాశాలున్నాయన్నారు. హైదరాబాద్ రెండో రాజధాని అవుతుందనే నమ్మకం ఉందని.. రాజ్యాంగంలో కూడా ఈ అంశం ఉంది అంటూ కామెంట్స్‌ చేశారు.

మళ్ళీ బీజేపీదే విజయం

ఇక‌.. ఈ అంశంపై అన్ని పార్టీలు కలిసి రావాల‌ని, పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌ర‌గాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు విద్యాసాగ‌ర్‌రావు. తెలంగాణ బీజేపీలో ఎలాంటి ఇబ్బందులు లేవని.. ఏమైనా ఉంటె కేంద్ర అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. దేశంలో మళ్ల‌ బీజేపీ గెలుస్తుందని, మోడీ ప్రభుత్వం వస్తుందని జోష్యం చెప్పారు. కొన్ని ఓట్లు జాయింట్ అకౌంట్‌లో ఉన్నాయి.. వాటిని విడిపించుకునే సత్తా త‌మ నాయకులకు ఉందన్నారు.

ఎన్నికల లబ్ధికోసమే అంటున్న బీఆర్ఎస్

పాకిస్తాన్‌, చైనాకు హైదరాబాద్‌ దూరంగా ఉందన్న విద్యాసాగర్‌రావు వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు. హైదరాబాద్‌ను రెండో రాజధానిగా చేయాలని మోదీకి లేఖ ఎందుకు రాయడంలేదన్న కాంగ్రెస్‌ నేత పొన్నం ప్రభాకర్‌ ప్రశ్నించారు. విద్యాసాగర్‌రావు వ్యాఖ్యలు కేవలం ఎన్నికల్లో లబ్ధిపొందడానికే అంటున్న బీఆర్‌ఎస్‌ నేతల అంటున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు