CM Revanth Love Story: తననెవరూ ఆపలేరు.. అదేమిటో గానీ, ఆమె గీసిన ‘గీత’ తనే దాటలేడు! పదునైన మాటలతో ప్రత్యర్థులు బిత్తరపోయేలా చేయగల మాటకారి అయి ఉండీ, ఆమె మాటాడితే ఎదురు చెప్పలేని నిరుత్తరుడవుతాడు! కోట విడిచి తనకోసం నడిచొచ్చిన రాకుమారి కదా మరి! తనలో సగం కాదు.. సమస్తమూ తనే అయిన ప్రేమికుడాయె! ఆమె ప్రేమ కోసం చకోరంలా నిరీక్షించి, ఆ ప్రేమ ఇచ్చిన గెలుపుతో చిచ్చరపిడుగయ్యాడు. ఆమె గీత.. ఆయన రేవంత్‌రెడ్డి. కొండారెడ్డిపల్లె పిల్లగాడిగా ఉన్న పెయింటర్, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా మారే వరకూ ప్రతి అడుగులో ఆమె ఉంది. ప్రతీ మలుపులో ముందుండి నడిపింది. నేడు వారి పెళ్లి రోజు సందర్భంగా రేవంత్ రెడ్డి-గీత లవ్ స్టోరీపై స్పెషల్ స్టోరీ..
ఇలా మొదలైంది..
వాళ్లది లవ్ ఎట్ ఫస్ట్ సైట్. చుట్టాల పెళ్లిలో ఓ శుభవేళ వారి చూపులు కలిశాయి. ‘గుండెనిండా గుడిగంటలు’ బ్యాగ్రౌండ్లో మోగుతుండగా.. గీతను చూసిన రేవంతుడు ప్రేమలో పడ్డాడు. క్షణమాలస్యం చేయలేదు. తన వెంటే ఉంటే ‘గీత’ దాటనని ప్రమాణం చేశాడు. ఏంచెప్పి మాయచేశాడోగానీ మొత్తానికి ఒప్పించాడు. అలా మొదలైంది వారి ప్రేమప్రయాణం. అప్పుడేమైనా ఫోన్లా, వాట్సప్పులా.. కలిసి మాట్లాడుకోవడానికి ఎన్ని అవస్థలు పడ్డారో! పైగా, ఇక్కడే ఓ ట్విస్టుంది. ఆమె సామాన్యురాలు కాదు.. రాజకీయోద్దండుడు జైపాల్‌రెడ్డికి స్వయానా తమ్ముడి బిడ్డ. అయినా, రేవంత్ వెనుకడుగు వేయలేదు. అప్పుడప్పుడే వృత్తి జీవితం ప్రారంభించి, విద్యార్థి నేతగా ఎదుగుతున్న ఆయన ఎలాగైన తన ప్రేమను గెలిపించుకోవాలని కృతనిశ్చయుడయ్యాడు.
CM Revanth Love Story: నేడు సీఎం పెళ్లి రోజు.. ప్రేమను కూడా కొట్లాడి గెలిచిన రేవంత్.. వాళ్ల లవ్ స్టోరీ ఇదే!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, గీత దంపతుల పెళ్లిరోజు. వీరి ప్రేమకథలో ఎన్నో మలుపులున్నాయి. రాజకీయ జీవితంలో మాదిరిగానే ప్రేమలో కూడా ఆయన కొట్లాడి సాధించాడు. ముఖ్యమంత్రి అయ్యే వరకూ ప్రతి అడుగులోనూ ఆయన వెన్నంటి నడిచింది రేవంత్ సతీమణి గీత.
Translate this News: