అగ్నికి పూర్తిగా ఆహుతైన మంత్రి ఇళ్లు

మణిపూర్‌లో హింస కొనసాగుతూనే ఉంది. కేంద్రమంత్రి ఇంటిపై పెట్రోల్ బాంబుతో ఆందోళనకారులు దాడి చేశారు. దాడిలో ఇళ్లు ధ్వంసమైతున్నా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోలేకపోయారు. రాష్ట్రంలో హింసతో శాంతిభద్రలు క్షీణించాయని, నా కష్టార్జితంతో కట్టిన ఇళ్లు ధ్వంసం చేశారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

New Update
అగ్నికి పూర్తిగా ఆహుతైన మంత్రి ఇళ్లు

The minister lamented the deterioration of law and order in the state

శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయి..

మీటీ, కుకీ తెగల మధ్య చెలరేగిన ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో హింసకు తెరపడడం లేదు. రాష్ట్రంలో శాంతిభద్రతలు రోజురోజుకీ మరింత క్షీణిస్తున్నాయి. ఇటీవల రాష్ట్ర మంత్రి ఇంటిపై దాడిచేసిన ఆందోళనకారులు తాజాగా ఇంఫాల్‌లోని విదేశాంగశాఖ సహాయమంత్రి ఆర్‌కే రంజన్‌సింగ్ ఇంటిని ధ్వంసం చేశారు. 1200 మందికిపైగా ఆందోళనకారులు కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించి మరీ రోడ్లపైకి వచ్చి విధ్వంసం సృష్టించారు. మంత్రి ఇంటిని చుట్టుముట్టి పెట్రోలు బాంబులతో దాడిచేశారు. ఈ దాడిలో మంత్రి ఇల్లు అగ్నికి పూర్తిగా ఆహుతైంది. ఆ సమయంలో మంత్రి ఇంట్లో లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

నేను అవినీతిపరుడిని కాదు..!

ఆ సమయంలో మంత్రి ఇంటి వద్ద 22 మంది భద్రతా సిబ్బంది పహారా కాస్తున్నప్పటికీ పెద్ద సంఖ్యలో వచ్చిన ఆందోళనకారులను నిలువరించలేకపోయారు. మే నెలలోనూ మంత్రి ఇంటిపై దాడి జరిగినా భద్రతా సిబ్బంది గాల్లోకి కాల్పులు జరిపి పరిస్థితిని అదుపు చేశారు. కాగా, గురువారం మధ్యాహ్నం ఆందోళనకారులు మరో రెండు ఇళ్లకు నిప్పు పెట్టారు. తన ఇంటిపై జరిగిన దాడి గురించి తెలిసిన కేంద్రమంత్రి రంజన్ కేరళ నుంచి వెంటనే తిరుగుపయనమయ్యారు. కష్టార్జితం కట్టుకున్న ఇంటిని ధ్వంసం చేయడం తనను షాక్‌కు గురిచేసిందన్నారు. తాను అవినీతిపరుడిని కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆర్‌కే రంజన్‌సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు