సినిమాలోకి బాలకృష్ణ వారసుడి ఎంట్రీ.. త్వరలో మోక్షజ్ఞతో బాలకృష్ణ

సీనియర్‌ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తనయుడు వెండితెరకు ఎప్పుడు పరిచయం కాబోతున్నారు? నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడని నందమూరి అభిమానులతో పాటు.. తెలుగు సినిమా ప్రేక్షకులు ఎంతో ఎదురుచూస్తున్నారు. ఈ ప్రశ్నల్నింటికి సమాధానాలు తెలుసుకోవాలని ఆసక్తిగా చూస్తున్నారు. అయితే అమెరికాలో ప్రస్తుతం అట్టహాసంగా తానా మహాసభల్లో ఈ ప్రశ్నలకు ఆఫ్ ది రికార్డ్ బాలకృష్ణ సమాధానం చెప్పారట.

New Update
సినిమాలోకి బాలకృష్ణ వారసుడి ఎంట్రీ.. త్వరలో మోక్షజ్ఞతో బాలకృష్ణ

The entry of Balakrishna successor in the movie..Balakrishna with salvation soon

ఆదిత్య 999తో మోక్షజ్ఞ ఎంట్రీ

బాలకృష్ణ సినీ ప్రయాణంలో స్పెషల్ సినిమాలు కొన్ని ఉన్నాయి. ఆదిత్య 369 అయితే మరీమరీ స్పెషల్. కంటెంట్, టెక్నాలజీ పరంగా హాలీవుడ్ స్థాయి సినిమా అది. దానికి సీక్వెల్ వస్తే చూడాలనేది ప్రేక్షకులు చిరకాల కోరిక. బాలకృష్ణ సైతం సీక్వెల్ చేయాలని చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. . ఆయన వందో సినిమా 'ఆదిత్య 369' సీక్వెల్ అవుతుందని వినిపించింది. అయితే... అప్పట్లో కుదరలేదు. ఇప్పుడు ఆ సినిమా పట్టాలు ఎక్కే టైం వచ్చిందని టాక్.

కథ రెడీ..

ఆదిత్య 369 సీక్వెల్‌కు ..ఆదిత్య 999 మాక్స్ టైటిల్ ఖరారు చేశారు. కథ కూడా రెడీ అయ్యింది. అందులో బాలకృష్ణ హీరోగా నటిస్తారు. తనతో పాటు మరో ప్రధాన పాత్రలో నందమూరి మోక్షజ్ఞ నటిస్తాడని, రాబోయే ఏపీ ఎన్నికల తర్వాత సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్తామని తానాలో అభిమానులకు చెప్పారట బాలకృష్ణ. అంటే వచ్చే ఏడాది బాలకృష్ణ తనయుడి సినిమా ప్రారంభం అవుతుంది. విడుదల ఎప్పుడు? అనేది బాలకృష్ణ చేతిలో ఉంటుంది మరి.

జోడీగా కాజల్ అగర్వాల్

ఇప్పుడు నందమూరి బాలకృష్ణ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే...యువ దర్శకుడు అనిల్ రావిపూడితో భగవంత్ కేసరి సినిమా చేస్తున్నారు. అందులో ఆయనకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. శ్రీలీల కీలక పాత్ర చేస్తున్నారు. ఇటీవల బాబీ కొల్లి దర్శకత్వంలో ఓ సినిమా స్టార్ట్ చేశారు. ఎన్నికలకు ముందు ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. తనతో సింహా, లెజెండ్,అఖండ వంటి హిట్ సినిమాలు తీసిన దర్శకుడు బోయపాటి శ్రీనుతో మరో సినిమా చేయడానికి బాలకృష్ణ ప్లాన్ చేస్తున్నారట. అది ఆదిత్య 999 మ్యాక్‌కు ముందు ఉంటుందా.. తర్వాత ఉంటుందా.. అనేది చూడాలి.

దర్శకత్వ బాధ్యతలపై వేచి చూడాలి..!

ఇంకా ఆసక్తికరమైన అంశం ఏమిటంటే... ఈ చిత్రానికి బాలకృష్ణ కథ రాయడం.. శర్వానంద్, అడివి శేష్‌ అతిథులుగా పాల్గొన్న అన్‌స్టాపబుల్ 2 ఎపిసోడ్‌లో ఆ విషయాన్ని బాలకృష్ణ వెల్లడించారు. ఆదిత్య 999 మాక్స్‌తో మోక్షజ్ఞ తెరంగేట్రం ఖాయమని ఓ స్పష్టత వచ్చింది. దాంతో అభిమానులు ఆనదం వ్యక్తం చేస్తున్నారు. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో రూపొందిన ఆదిత్య 369కు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. అందులో బాలకృష్ణ డ్యూయల్ రోల్‌లో అద్భుతంగా నటించారు. ప్రత్యేకించి శ్రీకృష్ణదేవరాయలు ఆహార్యంలో ఆయన నటన అద్భుతం. ప్రస్తుతం సింగీతం వయసు దృష్ట్యా ఆదిత్య 999 మాక్స్‌కు ఆయన దర్శకత్వం వహించే అవకాశాలు తక్కువ. వేరొకరి చేతిలో బాలకృష్ణ దర్శకత్వ బాధ్యతలు పెడతారా.. లేదంటే ఆయనే చేపడతారా.. అనేది చూడాలి.

#NULL
Advertisment
Advertisment
తాజా కథనాలు