మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్ దంపతులు​

తెలంగాణలో ఆషాఢ మాసంమంతా బోనాల జాతర ఉంటుంది. హైదరాబాద్​ నగరమంతా ఈ మాసం బోనాలు చేసుకుంటారు. వర్షాకాలంలో జరుపుకునే ఈ పండుగకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ కాలంలో జ్వరాలు, అంటు వ్యాధులు వ్యాపిస్తాయి. అలా జరగకుండా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటూ అమ్మవారికి బోనం సమర్పిస్తే అంతా మంచి జరుగుతుందని ప్రజల నమ్మకం.

New Update
మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్ దంపతులు​

Secunderabad CM KCR and MLC kavitha At lashkar Bonalu

బంగారు బోనం సమర్పణ

సికింద్రాబాద్‌లోని లష్కర్​ బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి భక్తుల వేలాది మంది వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. సీఎం కేసీఆర్​ దంపతులు వచ్చి అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహంకాళి అమ్మవారిని ఎమ్మెల్సీ కవిత దర్శించుకున్నారు. అమ్మవారికి బంగారు బోనం సమర్పించి పూజలు చేశారు.

ఘనంగా స్వాగతం

ఈ సందర్భంగా ఆలయ పూజారులు, అధికారులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సీఎం​తో కవిత, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, ప్రశాంత్‌రెడ్డి ,రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి కేశవరావు, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డి, స్థానిక కార్పొరేటర్ చీర సుచిత్ర, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ముఖ్య పండుగ బోనాలు

బోనాలు అంటేనే గుర్తుకు వచ్చేది గోల్కొండ, లష్కర్​. తెలంగాణ ముఖ్య పండుగైనా బోనాలు రాష్ట్రంలో ఘనంగా వారంవారం జరుగుతున్నాయి. గతవారం గోల్కొండ బోనాలు జరగ్గా ఈ వారం లష్కర్​ బోనాలు జరుగుతున్నాయి. రేపు రంగం జరుగుతుంది. సికింద్రాబాద్​ ఉజ్జయిని మహంకాళి బోనాలు ఘనంగా జరుతున్నాయి. ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. సీఎం కేసీఆర్​ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి బోనం సమర్పించారు. మహంకాళి అమ్మవారిని ఎమ్మెల్సీ కవిత దర్శించుకున్నారు. అమ్మవారికి బంగారు బోనం సమర్పంచి ప్రత్యేక పూజలు చేశారు. కేసీఆర్​తో పాటు మంత్రులు తలసాని, ఇంద్రకరణ్ రెడ్డి ఈ వేడుకలో పాల్గొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు