Petrol: అలా చేస్తే పెట్రోల్‌ కేవలం 15రూపాయలకే వస్తుంది.. వాహనదారులకు కీలక సూచనలు చేసిన కేంద్రమంత్రి

రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్‌లో జరిగిన ఒక సమావేశంలో నితిన్ గడర్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఇక అన్ని వాహనాలు రైతులు ఉత్పత్తి చేస్తున్న ఇథనాల్‌ ఇంధనంపై నడుస్తాయని అన్నారు. 60 శాతం ఇథనాల్, 40 శాతం ఎలక్ట్రిసిటీ సగటు ఆధారంగా చూస్తే అప్పుడు దేశంలో పెట్రోల్ లీటరుకు రూ.15కే లభిస్తుందని ఆయన తెలిపారు.

New Update
Petrol: అలా చేస్తే పెట్రోల్‌ కేవలం 15రూపాయలకే వస్తుంది.. వాహనదారులకు కీలక సూచనలు చేసిన కేంద్రమంత్రి

పెట్రోల్‌కు ప్రత్యామ్నాయాలేంటి..? ఎలక్ట్రిక్‌ వాహనాల కంటే ఇథనాల్‌ వెహికల్సే బెస్టా..? రానున్న కాలం మొత్తం ఇథనాల్‌దేనా..? అప్పుడు లీటర్‌ పెట్రోల్‌ 15రూపాయలకే లభిస్తుందా..? కేంద్రం ఏం చెబుతోంది..?

ఇంకెన్నాళ్లీ కష్టాలు..?
వచ్చే జీతంలో పెట్రోల్‌కు సపరేట్‌ కోటా ఉంటుంది. ఈఎమ్‌ఐలు(EMI) లెక్క వేసుకున్నట్టే ఇంటి బడ్జెట్‌లో పెట్రోల్‌కి కూడా ఓ స్థానం ఉంటుంది. పెట్రోల్‌ రెట్లు పెరగడమో, స్థిరంగా ఉండడమో జరుగుతుంటుంది కానీ..తగ్గడం మాత్రం చాలా అరుదు. ఒక్కసారి పెరిగిందంటే తగ్గడానికి చాలా కాలం పడుతుంది. కరోనా ఫస్ట్ వేవ్‌ సమయానికి లీటర్‌కు 75రూపాయలగా ఉండాల్సిన పెట్రోల్‌ ధర..ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో 100రూపాయలుగా.. మరికొన్ని రాష్ట్రాల్లో 110రూపాయలుగా కొనసాగుతోంది. ఆర్థిక మాంద్యం అని..రష్యా-యుక్రెయిన్‌ యుద్ధమని దానికి రకరకాల కారణాలున్నాయి. అందుకే పెట్రోల్‌ ధరల మోత భరించలేక కొద్దీ కాలం క్రితం వాహనదారులు ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌పై ఫోకస్‌ పెట్టారు. అవి కాస్త పేలిపోవడం, కాలి బూడిదైపోవడం లాంటివి జరిగాయి. దీంతో ఈవీ వాహనాల సెల్స్‌ కూడా ఢమాల్‌ అయ్యాయి. ఈ పరిణామాలను నిశితంగా పరీశిలిస్తూ వచ్చిన కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రత్యామ్నాయలపై దృష్టి సారించారు.

ఫ్యూచర్‌ అంతా ఇథనాల్‌దేనా:
ఈ మధ్యకాలంలో ఫ్యూయల్‌గా ఇథనాల్‌పై ఎక్కువగా చర్చ జరుగుతోంది. పెట్రోల్‌ స్థానాన్ని పూర్తిగా ఇథనాల్‌ ఆక్రమిస్తే పర్యాయవరణానికి మేలుతో పాటు ప్రజలపై ఆర్థిక భారం కూడా తగ్గుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నితిన్‌ గడ్కరీ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. రాజస్థాన్లో పర్యటించిన ఆయన.. ప్రతాప్‌గఢ్‌ సభలో చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. వెహికల్స్‌కు ఫ్యూయల్‌ కోసం వాహనదారులు సగటున 60 శాతం ఇథనాల్..మరో 40 శాతం విద్యుత్‌ను ఉపయోగిస్తే పెట్రోల్ లీటర్ రూ.15కే లభిస్తుందని చెప్పడంపై సోషల్‌మీడియాలో చర్చ జరుగుతోంది. ఆయన చెప్పిందే అక్షరాలే నిజమేనని మార్కెట్‌ నిపుణులు సైతం చెబుతున్నారు. ఇథనాల్‌తో నడిచే వాహనాలు ఎక్కువగా వినియోగిస్తే పెట్రోల్‌ దిగుమతులు భారీగా తగ్గుతాయి. అందుకే నితిక్‌ గడ్కరీ చెప్పింది పాటిస్తే బాగుంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అటు వాహనాలు సైతం ఇథనాల్‌తో రన్‌ అయ్యేవి పూర్తి స్థాయిలో మార్కెట్‌లోకి వస్తే మంచిదంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఇథనాల్‌ లీటర్‌కు 60రూపాయలే ఉండగా.. పెట్రోల్‌ దాదాపు ప్రతిచోటా రూ.100కు పైనే ఉంది.

ఇథనాల్‌తో అంతా మంచే:
ఎలిక్ట్రిక్‌ వాహనాలు సైతం పర్యావరణానికి మంచి చేసేవే అయినా.. వాటి ధర మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఇక ఎన్నో గంటలు ఛార్జ్‌ చేస్తే కానీ వంద కిలోమీటర్లు కూడా వెళ్లని పరిస్థితి. పైగా బ్యాటరీ ఎప్పుడు పేలుతుందోనని టెన్షన్‌ పడాల్సిన దుస్థితి. అందుకే ఈవీలకు బదులుగా కేంద్రం కూడా ఇథనాల్‌ వాహనాలపై ఫోకస్‌ పెంచింది. ఇదే విషయంపై ఇటివలే మెర్సీడెజ్‌ ఛైర్మన్‌తో నితిన్‌ గడ్కరీ భేటీ కూడా అయ్యారు. మరి చూడాలి ఇథనాల్‌ అస్త్రమైనా ఈవీల లాగా కాకుండా హిట్‌ అవుతుందో..ఫట్‌ అవుతుందో..!

Advertisment
Advertisment
తాజా కథనాలు