మోడల్‌పై అత్యాచారం.. ఆపై యువకుడి బ్లాక్‌మెయిలింగ్ .... By Shareef Pasha 15 Jun 2023 in నేషనల్ New Update షేర్ చేయండి దేశంలో ఎన్ని కఠినమైన చట్టాలు తీసుకొచ్చినా.. రోజురోజుకి దేశంలో మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. సాధారణ మహిళల నుంచి ఇప్పుడు సెలబ్రెటీల వరకు చేరింది. తాజాగా... అలాంటి ఘటనే మరొక్కటి ముంబైలో జరిగింది. కాకపోతే జరిగింది మోడల్‌పై.. అదేంటో తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..... ముంబైలో ఓ మోడల్‌పై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా ఆపై బ్లాక్‌మెయిలింగ్‌కు దిగుతున్న నిందితుడిని బీహార్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. రాంచీకి చెందిన నిందితుడు తన్వీర్‌ఖాన్‌ను రెండు వారాల తర్వాత బీహార్ రాష్ట్రంలోని అరారియా జిల్లాలో బుధవారం అరెస్ట్ చేశారు. నిందితుడిని రాంచీకి తరలించనున్నారు. తన్వీర్‌పై ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఈ కేసును రాంచీకి బదిలీ చేశారు. బీహార్‌లోని భగల్‌పూర్‌కు చెందిన బాధిత మోడల్ మోడలింగ్ వర్క్‌షాప్ కోసం రాంచీ వచ్చింది. అక్కడామెకు పరిచయమైన నిందితుడు 2021 నుంచి పలుమార్లు అత్యాచారానికి పాల్పడడమే కాకుండా బ్లాక్‌మెయిలింగ్‌కు దిగాడు. ఈ విషయాన్ని బయటపెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తనను బెదిరించినట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. ఈ ఆరోపణలను తన్వీర్ ఖండించాడు. ఆమె తన ఏజెన్సీలో పనిచేసిందని, ఈ క్రమంలో నష్టపోయిన తాను పరిహారం అడగడంతో బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతోందని సెల్ఫీ వీడియోలో ఆరోపించాడు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి