Telangana News: వేములవాడలో భయపెట్టిన ప్రేమజంట..అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ మధ్య గురుకుల పాఠశాలలో వరుస పెట్టి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కరీంనగర్లో తిరుమలేశ్వరి ఘటన మరువకముందే.. నాగర్‌కర్నూల్‌లో మరొక ఘటన చోటుచేసుకుంది. అయితే ఏపీలో నిన్న వాలంటీర్ ఆధార్ కార్డు నెంబర్ పేరుతో మాయమాటలు చెప్పి బాలికపై అత్యాచారం చేసిన ఘటన తెలిసిందే. తాజాగా ఎలక్ట్రికల్ పని కోసం వెళ్లి ఓ యువకుడు బాలికకు వల వేశాడు. By Vijaya Nimma 19 Oct 2023 in తెలంగాణ కరీంనగర్ New Update షేర్ చేయండి ఈ మధ్య గురుకుల పాఠశాలలో వరుస పెట్టి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కరీంనగర్లో తిరుమలేశ్వరి ఘటన మరువకముందే.. నాగర్‌కర్నూల్‌లో మరొకటిన చోటుచేసుకుంది. అయితే ఏపీలో నిన్న వాలంటీర్ శివకుమార్ ఆధార్ కార్డు నెంబర్ పేరుతో మాయమాటలు చెప్పి బాలికపై అత్యాచారం చేసిన ఘటన తెలిసిందే. తాజాగా ఎలక్ట్రికల్ పని కోసం వెళ్లి ఓ యువకుడు బాలికకు వల వేశాడు. అంతేకాకుండా అమ్మాయి చదువుతున్న గురుకుల పాఠశాల వద్దకు వెళ్లి తనని తీసుకొని పారిపోయాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఇది కూడా చదవండి: ఏలూరులో రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు… ఆన్లైన్ పేరుతో టోకరా వివరాల్లో వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ప్రేమ జంట కలకలం రేపింది. నాగర్ కర్నూల్ జిల్లా బలమూరు మండలం బాణాల గ్రామానికి చెందిన 14 సంవత్సరాల బాలికను మాయమాటలు చెప్పి ఒక యువకుడు వేములవాడకు తీసుకు వచ్చాడు. అమ్మాయి తల్లిదండ్రులు, అచ్చంపేట పోలీసులు పథకం ప్రకారం.. వేములవాడ బస్ స్టేషన్లో బస్సు దిగారు. అక్కడ నుంచి ఇద్దరు ఒకరిని ఒకరు పట్టుకొని బస్టాండ్‌లోకి వెళ్లారు. వీరికి సంబంధించి అక్కడ ఉన్న స్థానికులకు విషయం తెలియక ఓ వ్యక్తి భయాందోళనకు గురి అయ్యాడు. మాయ మాటలు చెప్పి ఈ ఘటనపై అమ్మాయి తల్లి వివరణ ఇచ్చింది. తన ఇంటికి ఎలక్ట్రికల్ పని కోసం వచ్చిన యువకుడు మాయ మాటలు చెప్పి తన కూతుర్ని కస్తూర్బా పాఠశాల నుంచి దసరా సెలవుల్లో తీసుకుపోయాడని తెలిపారు. అయితే.. అమ్మాయిని తండ్రి తీసుకురావడానికి వెళ్లేసరికి పాఠశాలలో లేకపోయేసరికి తల్లిదండ్రులు ఆందోళన గురైయ్యారు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు పక్కా సమాచారంతో వేములవాడలో ఉన్నారని గ్రహించారు. పోలీసులు చాకచక్యంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. మైనర్ అమ్మాయిని తీసుకువెళ్లిన్నందుకు అబ్బాయిని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇది కూడా చదవండి: దమ్ముంటే నేను ఖమ్మంలో ఉన్నప్పుడు ఆ పని చేయండి: తుమ్మల, పొంగులేటిపై పువ్వాడ ఫైర్ #love-couple #vemulawada #rajanna-sirisilla-district మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి