ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్.. ఏం జరిగింది? By Vijaya Nimma 15 Jun 2023 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి విశాఖపట్నంలో కిడ్నాప్ కలకలం రేపిన ఘనట సుఖాంతంగా ముగిసింది. కిడ్నాపైన ప్రముఖ ఆడిటర్, రియల్టర్ జీవీ, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుమారుడు, అతని భార్య విశాఖ- ఏలూరు రోడ్డులో ఆచూకీని పోలీసులు కనిపెట్టిన్నారు. నలుగురు కిడ్నాపర్లను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు హేమంత్‌గా గుర్తించిన పోలీసులు.. కిడ్నాపైన గంటలోనే కేసుకు చేధించారు. 17 బృందాలతో స్పెషల్ సెర్చ్ ఆపరేషన్ చేశారు. దాంతో కిడ్నాప్ కథ సుఖాంతంగా ముగిసిందన్నారు. కిడ్నాప్‌ను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేసి కొద్ది సేపట్లోనే కిడ్నాపర్ల ఆచూకీని కనిపెట్టారు. అయితే రుషికొండ సమీపంలోని బేమౌంట్ ఎదురుగా ఉన్న ఇంట్లోకి చొరబడిన కిడ్నాపర్లు ముందుగా ఎంవీవీ కుమారుడు చందు, ఎంపీ ఎంవీవీ భార్య జ్యోతిని బందించారు. ఆపై వారితో ఆడిటర్ జీవీకి ఫోన్ చేయించి ఆయనను కిడ్నాప్ చేశారు. ఈ కిడ్నాప్‌నకు ప్రధాన కారకుడైన రౌడీషీటర్ హేమంత్ రూ. 50 కోట్ల డిమాండ్ చేశారు. ఈ కిడ్నాప్‌కి భూ వివాదాలేనా? ఇంకేమైనా కారణాలున్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను డీసీపీ కార్యాలయానికి పోలీసులు తీసుకురానున్నారు. విశాఖపట్నంలో గురువారం కిడ్నాప్ కలకలం రేగింది విషయం తెలిసిందే. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు. ఘటనపై మరింత లోతుగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కిడ్నాప్‌కు కారణాలు ఇంకా ఏమైనా ఉన్నాయని రీతిలో దర్యాప్తు సాగుతుందని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఈ ఘటనపై స్పందించారు. తన కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారని ఓ ప్రకటన విడుదల చేశారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి