MP Magunta: మహచండి యాగం చేసిన MP మాగుంట.. కొడుకు కోసమేనా?

ఒంగోలు MP మాగుంట.. మహచండి యాగం చేశారు. కొడుకు రాజకీయ భవిష్యత్ కోసమే యాగమంటూ వార్తలు వినిపిస్తున్నాయి. టీడీపీలో చేరి ఈసారి కొడుకు రాఘవ రెడ్డిని ఒంగోలు నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపేందుకు చూస్తున్నారని తెలుస్తోంది.

New Update
MP Magunta: మహచండి యాగం చేసిన MP మాగుంట.. కొడుకు కోసమేనా?

Ongole MP Magunta: ఒంగోలు వైసీపీ MP మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీలోకి చేరనున్నారని పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. టీడీపీలో చేరి ఈసారి కొడుకు రాఘవ రెడ్డిని ఒంగోలు నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపేందుకు చూస్తున్నారని తెలుస్తోంది. రాఘవరెడ్డిని ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిపేందుకు టీడీపీ అధిష్టానం సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

Also Read: ఆడుదాం ఆంధ్ర అంటూ వైసీపీ ప్రభుత్వం ఇలా చేస్తోంది : షర్మిల

ఒంగోలు ఎంపీ స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా టీడీపీ బలాబలాలపై మాగుంట ఆరా తీశారని.. టీడీపీలో చేరే నాటికి నియోజకవర్గంలోని లోటుపాట్లు గుర్తించి.. పార్టీలో చేరిన తరువాత అధిష్టానం సహకారంతో వాటిని చక్కదిద్దుకునేందుకు ఎంపీ మాగుంట దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గతంలో ముహూర్తం చూసుకొని టీడీపీలో చేరాలని మాగుంట భావించారు. మంచి ముహూర్తంపై పురోహితులను సంప్రదించగా.. ఈ నెల చివరి వారంలోని కానీ లేదంటే మార్చి మొదటి వారంలో పలు తేదీలను సూచించినట్లు సమాచారం.

Also Read: ‘నువ్వు ఇంతకన్నా ఏం పీకలేవ్‌..’ సింపతి గేమ్స్‌ వద్దు విహారీ..!

తాజాగా, ఒంగోలు MP మాగుంట మహచండి యాగం చేశారు. అయితే, ప్రజా సుభిక్షం కోసమా? లేక రాజకీయా కొనమా? అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీ మారుతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో మాగుంట యాగం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల CM కార్యక్రమానికి గైర్ హాజరు అయిన నేపద్యంలో అందరి చూపు మాగుంట వైపే ఉందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, కొడుకు రాజకీయ భవిష్యత్ కోసమే యాగం అంటూ ప్రచారం జరుగుతోంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు