Ramayana : బాలీవుడ్ స్టార్ రన్ బీర్ కపూర్(Ranbir Kapoor), సాయి పల్లవి(Sai Pallavi) లీడ్ రోల్స్ లో బాలీవుడ్ లో ‘రామాయణం’ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హిందీ దర్శకుడు నితీష్ తివారి ఈ ప్రాజెక్ట్ ని డైరెక్ట్ చేస్తున్నారు. హిందూ ఇతిహాస గాథ రామాయణం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో ‘కెజిఫ్’ హీరో యష్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు. దీంతో అప్పుడే సినిమాపై ఆడియన్స్ లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే షూటింగ్ మొదలైన ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర వార్త బయటికి వచ్చింది. ఈ సినిమాలో రావణుడి పాత్ర పోషిస్తున్న కన్నడ హీరో యష్ అప్పుడే తన పాత్ర కోసం కసరత్తులు మొదలు పెట్టేసాడట.
పూర్తిగా చదవండి..Yash : ‘రామాయణం’ కోసం ‘KGF’ హీరో భారీ సాహసం?
నితీష్ తివారి బాలీవుడ్ ప్రాజెక్ట్ 'రామాయణం' లో రావణుడి పాత్ర కోసం కన్నడ హీరో యష్ ఏకంగా 12 కేజీల బరువు పెరగనున్నట్లు తెలుస్తోంది.
Translate this News: