ఈ దరిద్రం పార్టీలో చూస్తాననుకోలె: ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇంత బతుకు బతికి పార్టీలో ఇలాంటి పరిస్థితి చూస్తాననుకోలె అని జగ్గారెడ్డి కాంగ్రెస్‌పై కామెంట్ చేశారు. ఇప్పుడు ఈ హాట్ కామెంట్స్‌తో అందరిలో హైటెన్షన్ మొదలైంది. ఓ పక్క కాంగ్రెస్ అధిష్టానం పార్టీ మారిన నేతలను బుజ్జగించే పనిలో బిజీగా ఉంటే.. మరోపక్క హాట్ కామెంట్లతో హైకమాండ్‌కు హైటెన్షన్ పుట్టిస్తున్నారు టీకాంగ్రెస్ నేతలు. By Vijaya Nimma 27 Jun 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి కాంగ్రెస్‌లో దరిద్రం దాపురించింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ నేతలపై తప్పుడు ప్రచారం చేయించే దరిద్రం దాపురించిందన్నారు. నాలుగేళ్లుగా పార్టీలో తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. పార్టీ కోసం ఎంతో చేసిన తనను ప్రశ్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత బతుకు బతికి పార్టీలో ఇలాంటి పరిస్థితి చూస్తాననుకోలేదన్నారు. ఉత్తమ్ ఆవేదన వెనుక బలమైన కారణం ఉందన్నారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ఢిల్లీకి.. ఎన్నికల వ్యూహాలపై చర్చించేందుకు రాహుల్ పిలిస్తే ఢిల్లీకి వచ్చానని చెప్పారు జగ్గారెడ్డి. పార్టీ ఐక్యంగా ఉందో లేదో రాహుల్ గాంధీకి వివరిస్తానని చెప్పారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయో చెబుతానన్నారు. ఎన్నికలంటే రూ. 20 కోట్లు, రూ. 30 కోట్లు అనే పరిస్థితి వచ్చిందన్నారు. టీకాంగ్రెస్‌పై చర్చ ఏఐసీసీలో తెలంగాణ కాంగ్రెస్ నేతల నేటి సమావేశంలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ నేతృత్వంలో సమావేశం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. రాష్ట్ర ఇన్‌చార్జీ మాణిక్‌రావు ఠాక్రేతో పాటు రేవంత్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, జగ్గారెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ, మధుయాష్కి గౌడ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క,జీవన్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహా పాల్గొన్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి