బండి సంజయ్, కవిత మధ్య ట్విట్టర్ వార్...

New Update

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్య ట్విట్టర్ వేదికగా వార్ జరిగింది. తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మంగళవారం ఉదయం బండి సంజయ్ ట్వీట్ చేశారు. దీనికి కవిత అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఉదయం బండి సంజయ్ ట్వీట్ చేస్తూ... గవర్నర్ కు గౌరవం దక్కదు.. ఆడబిడ్డలకు లేదు అండ.. గిరిజన మహిళలపై పోలీస్ గిరీ, బతుకమ్మను అవమానించిన వాడితో ఆలింగనం.. ఇంటి బిడ్డకు మాత్రం బలగంతో నిలబడతవ్ అడ్డం... అదిరింది కేసీఆర్ నీ మహిళా సంక్షేమం అంటూ ఎద్దేవా చేశారు.

httpstwitter.comRaoKavithastatus1668558052268855297

దీనిపై కవిత కౌంటర్ ట్వీట్ చేశారు. పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంలో గిరిజన మహిళా రాష్ట్రపతికి గౌరవం దక్కదు... మహిళా రెజ్లర్లు ధర్నా చేస్తున్నా తప్పు చేసిన బీజేపీ ఎంపీపై చర్యలు తీసుకోరు.. నినాదాలకే పరిమితమైన భేటీ బచావో... బేటీ పడావో.. సిలిండర్ ధరలు విపరీతంగా పెంచి మహిళలకు కన్నీరు తెప్పిస్తున్న దుస్థితి... మహిళా విద్య, వైద్యంపై పూర్తి నిర్లక్ష్యం.. ఆడబిడ్డల సంక్షేమం కంటే కొందరి అభివృద్ధే ముఖ్యం.. ఆడబిడ్డ తలుచుకుంది.. ఇక మీ అడ్రస్ గల్లంతవుతుందని కవిత ట్వీట్ చేశారు. దీంతో ట్విట్టర్‌ వేదికగా పెద్ద చర్చ జరిగింది. దీంతో నువ్వా.. నేనా అన్నట్టుగా పరస్పరం ట్విట్టర్ వేదికగా ఒకరికొకరు కౌంటర్లతో సమాధానం ఇచ్చుకున్నారు.

http://httpstwitter.comRaoKavithastatus1668558052268855297

Advertisment
Advertisment
తాజా కథనాలు