టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో టమోటాల పంపిణీ నిత్యావసర ధరలు పెరిగి చాలా ఇబ్బందులకు గురిచేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కిలో టమాటాను కొనాలంటే సామాన్యుడికి గుండె జారిపోతుంది. ప్రజల కష్టాలు తెలుసుకోని.. ఏపీ టీడీపీ నేత బుద్ధ వెంకన్న ఆధ్వర్యంలో సబ్సిడీ కింద కిలో టమాటాను 30 రూపాయలకే పంపిణీ చేశారు. అంతేకాకుండా అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తూ.. నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో సీఎం జగన్ విఫలమైయ్యారని మండిపడ్డారు. By Vijaya Nimma 07 Jul 2023 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి సబ్సిడీపై టమాటా పంపిణీ విజయవాడలోని రథంసెంటర్‌లో టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, నాగుల్ మీరా ఆధ్వర్యంలో టమాటాల పంపిణీ జరిగింది. ఈసందర్భంగా ఒక్కొక్కరికీ కిలో టమాటాలను పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమం తర్వాత బుద్దా వెంకన్న మాట్లాడుతూ కిలో ముప్పై రూపాయలకు మధ్యతరగతి వాళ్లకు టమాటాల పంపిణీచేయడం జరిగిందనీ, పేదలకైతే ఉచితంగానే ఇస్తామని వారు పేర్కొన్నారు. ఇప్పుడు మార్కెట్లో కిలో టమాట ధర 150 రూపాయలుంది. ప్రస్తుతం తులం బంగారం కన్నా కిలో టమాటలనే మహిళలు కోరుకునే పరిస్థితి ఉంది. అధికార పార్టీ వాళ్లు మొక్కుబడిగా సబ్సిడీపై టమాటా పంపిణీ చేసి చేతులు దులుపుకుంటున్నారన్నారు. నేడు వాలంటీర్ వ్యవస్థ గురించి గొప్పగా చెప్పుకునే సీఎం వారి ద్వారా ఇంటింటికీ రెండు కిలోల టమాటాలను పంపిణీ ఎందుకు చేయట్లేదని విమర్శించారు. తూతూ మంత్రంగా పంపిణీ సైకో సీఎంకి చిత్తశుద్ధి లేకే, తూతూ మంత్రంగా కొద్దిమందికి టమాటా పంపిణీ చేస్తున్నారని దుయ్యబట్టారు. నిత్యావసరాల ధరలను నియంత్రణ చేయడంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విఫలమయ్యారని వారు విమర్శించారు. ధరలను స్థిరీకరించడం కోసం మూడు వేల కోట్లు కేటాయిస్తామని చెప్పిన జగన్ ఇచ్చిన మాట తప్పారని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్దితో టమోటా ధర అదుపులోకి వచ్చే వరకు ఇంటింటికి కిలో ఇవ్వాలన్నారు. అప్పటి వరకు పశ్చిమ నియోజకవర్గంలో కిలో ముప్పై రూపాయలకే మేము ప్రతి రోజు 500ల కిలోల వరకు టమాటా అందిస్తాం అని చెబుతూ..పేదలకు అయితే పూర్తి ఉచితంగా టమాటాలు పంపిణీ చేస్తున్నామన్నారు. మోసాలు, మాయలను ప్రజలకు వివరిస్తాం రాష్ట్రంలో సీఎం జగన్మోహన్‌రెడ్డి దోచుకున్న డబ్బులు తాడేపల్లి ప్యాలెస్‌లో పెట్టాడని విమర్శించారు. అంత డబ్బు ఏం చేసుకుంటావు.. పేద ప్రజలకు కొంతైనా పెట్టు.. దోచుకున్న డబ్బు తీస్తే రాష్ట్ర ప్రజలకు ఉచితంగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయవచ్చు అంటూ జగన్‌పై విమర్శల వర్షం కురిపించారు. జగన్ అధికారంలోకి వచ్చాక కుటుంబంలో ఒక్కో వ్యక్తి మీద. నెలకు నాలుగు వేల భారం పడిందని, యేడాదికి లక్షా 82వేలు భారం ప్రజలపై మోపి, ఖాతాల్లో పది, ఇరవై వేలు వేసి గొప్ప అని ప్రభుత్వం చెబుతోందనీ అన్నారు. అయితే త్వరలోనే జగన్‌మోహన్‌రెడ్డి మోసాలు, మాయలను ప్రజలకు వివరిరిస్తామని బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి