మౌత్ వాష్ దంతాల ఆరోగ్యాన్ని కాపాడటానికి, నోటి దుర్వాసనను తొలగించడానికి సహాయపడుతుంది. కానీ ఈమధ్య దీన్ని రెగ్యులర్‌గా ఉపయోగిస్తున్నారు. ఈ నేపధ్యంలో మీరు కొన్ని విషయాలను తప్పక తెలుసుకోవాలి. నిజానికి మౌత్ వాష్ నోటిని ప్రకాశవంతంగా, శుభ్రంగా ఉంచుతుంది. అలాగే చల్లని, మంచి అనుభూతిని కలిగిస్తుంది. మన నోట్లోని చెడు బ్యాక్టీరియాను చంపుతుంది. నోట్లో మౌత్ వాష్ వేసుకున్నప్పుడు అది టూత్ బ్రష్ వెళ్ళలేని మూల మూలాలకు వెళుతుంది. ఇది చిగుర్ల వాపును కూడా తగ్గిస్తుంది. అయితే మౌత్ వాష్ ఒక్కటే వాడితే సరిపోదు. రోజూ బ్రష్ చేసుకోవటం తప్పనిసరి. అలాగే మౌత్ వాష్‌లో ఆల్కహాల్ ఉంటుంది. దీంతో మీ నోరు పొడిబారుతుంది. మౌత్ వాష్ రెగ్యులర్ ఉపయోగం శరీరంలో తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది.
పూర్తిగా చదవండి..మౌత్ వాష్ తో దంతాలకు ముప్పు!
మౌత్ వాష్లను తరచూ వాడడం వల్ల ప్రయోజనాలతో పాటు నష్టాలు కూడా ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందులోని ఆల్కాహాల్ ఆధారిత మౌత్ వాష్ లు వాడటం ప్రమాదకరమని ఒక తాజా అధ్యయనంలో తేలింది.
Translate this News: