రేపే ఎమ్మెల్యేగా జలగం వెంకట్రాపు ప్రమాణ స్వీకారం..

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు బిగ్‌బిగ్‌ షాక్‌ తగిలింది. ఎమ్మెల్యేగా వనమా ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది.

New Update
రేపే ఎమ్మెల్యేగా జలగం వెంకట్రాపు ప్రమాణ స్వీకారం..

publive-image వనమా వెంకటేశ్వరరావు, జలగం వెంకట్రావు (ఫైల్)

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు బిగ్‌బిగ్‌ షాక్‌ తగిలింది. ఎమ్మెల్యేగా వనమా ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. కొత్తగూడెం ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావును ప్రకటించింది కోర్టు. వనమా వెంకటేశ్వరరావు గెలుపును సవాల్ చేస్తూ 2018లో హైకోర్టును ఆశ్రయించారు జలగం వెంకట్రావు. ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు నివేదిక సమర్పించారని చెప్పారు. ఫిర్యాదులో పేర్కొన్న జలగం వెంకట్రావు సమగ్ర విచారణ తర్వాత వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చింది హైకోర్టు. సమీప అభ్యర్ధి జలగం వెంకట్రావును విజేతగా ప్రకటించింది కోర్టు. ఎన్నికల కమీషన్‌కు తప్పుడు అఫిడవిట్ సమర్పించిందుకు వనమాకు రూ.5 లక్షల జరిమానా విధించారు. 2018 నుంచి ఇప్పటివరకు ఎమ్మెల్యేగా అర్హుడు కాదని హైకోర్టు తీర్పు చెప్పింది.

click here for vanama affidavit :

కొత్తగూడెం ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావు కాసేపట్లో ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలవనున్నారు. రేపే(జులై26) ఎమ్మెల్యేగా జలగం వెంకట్రాపు ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది. న్యాయస్థానం తీర్పును రిటర్నింగ్ ఆఫీసర్, అసెంబ్లీ స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శికి అందజేయనున్నారు జలగం వెంకట్రావు. 2014లో బీఆర్ఎస్ తరపున కొత్తగూడెం నుంచి పోటీచేసి గెలిచారు. 2018 సార్వత్రిక ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా పోటీ చేసిన వనమా వెంకటేశ్వరరావు చేతిలో 4,139 ఓట్ల తేడాతో పరాజయం పాలైయ్యారు జలగం వెంకట్రావు. నాలుగున్నరేళ్ల సుధీర్ఘ కాలం తరువాత న్యాయస్థానం తీర్పుతో కొత్తగూడెం ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టనున్నారు జలగం వెంకట్రావు.

Advertisment
Advertisment
తాజా కథనాలు