పిల్లలను కాపాడి.. ప్రాణాలు వదిలి.. అమెరికాలో అద్దంకి వాసి మృతి!

బాపట్ల జిల్లాకు చెందిన పొట్టి రాజేశ్ కుమార్ అమెరికాలో మృతి చెందారు. ఉద్యోగరీత్యా ఫ్లోరిడా బ్రిడ్స్ వాటర్ కమ్యూనిటీలో నివాసముంటున రాజేశ్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కుటుంబంతో కలిసి జాక్సన్ విల్ విట్లర్ బీచ్‌కు విహార యాత్రకు వెళ్లగా..అక్కడ సముద్రంలో స్నానంగా చేస్తుండగా అలల తాకిడి ఒక్కసారిగా పెరిగింది. దీంతో సముద్రంలో పిల్లలు కొట్టకుపోయారు. వాళ్లని కాపాడే క్రమంలో రాజేశ్‌ ప్రాణాలు విడిచారు. రాజేశ్ మృతి పట్ల అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ సంతాపం తెలిపారు.

New Update
పిల్లలను కాపాడి.. ప్రాణాలు వదిలి.. అమెరికాలో అద్దంకి వాసి మృతి!

పుట్టి పెరిగింది ఇక్కడే..ఉద్యోగరీత్యా అమెరికా వెళ్లారు. అక్కడే నివాసముంటున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండే కుటుంబం వాళ్లది. ఆటపాటలతో నిత్యం ఆనందంగా గడిపే ఫ్యామిలీ వాళ్లది. సెలవు దొరికితే సరదాగా షీకారుకు వెళ్లే వాళ్ల జీవితాలపై మృత్యువు దాడి చేసింది. ఒకరి ప్రాణాలను బలిగొంది. అమెరికాలో అద్దంకికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ పొట్టి రాజేశ్‌కుమార్‌ (42) ప్రమాదవశాత్తూ చనిపోవడం స్థానికంగా విషాదఛాయలు నింపింది.

పిల్లలను కాపాడి.. ప్రాణాలను వదిలి..:
మృత్యువు ఎప్పుడు, ఎలా వస్తుందో తెలియదు. ఆ సమయం రాగానే ఎవరినైనా మృత్యుదేవత తన కౌగిల్లోకి లాగేసుకుంటుంది. అప్పటివరకు ఆనందంగా గడిపిన వాళ్లని సైతం క్షణాల్లో తీసుకుపోతుంది. అలాంటి ఘటనే అమెరికాలో జరిగింది. బాపట్ల జిల్లాకు చెందిన పొట్టి రాజేశ్ కుమార్ అమెరికాలో చనిపోయారు. ఉద్యోగరీత్యా ఫ్లోరిడా బ్రిడ్స్ వాటర్ కమ్యూనిటీలో రాజేశ్ నివాసముంటున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కుటుంబంతో కలిసి జాక్సన్ విల్ విట్లర్ బీచ్‌కు విహార యాత్రకు వెళ్లారు. అక్కడే మృత్యువు కాపు కాచుకొని కూర్చున్నది. ఈ విషయం తెలియని కుటుంబసభ్యులు సముద్రంలో సరదాగా గడిపేందుకు దిగారు. చాలా సేపు అలలతో ఆడుకున్నారు. స్నానం చేసేందుకు కాస్త ముందుకు వెళ్లారు. అదే వాళ్ల జీవితాలను తలకిందులు చేస్తుందని ఊహించలేకపోయారు. అప్పటివరకు నిదానంగా సాగిన అలలు ప్రవాహం ఒక్కసారిగా స్పీడ్‌ పెంచింది. అలల తాకిడి ఒక్కసారిగా పెరగడంతో ఇద్దరు పిల్లలూ సముద్రంలో కొట్టుకుపోయారు. ప్రవాహంలో మునిగిపోతున్న పిల్లలను కాపాడేందుకు రాజేశ్‌కుమార్‌ ముందుకు వెళ్లారు. పిల్లలను కష్టంమీద కాపాడారు. అయితే వాళ్లని కాపాడే క్రమంలో ఆయన్ను అలలు కబళించాయి. దీంతో సముద్రపు అలల్లో కొట్టుకుపోయారు.

గాలింపు చర్యలు..మృతదేహం గుర్తింపు:
నిమిషాల వ్యవధిలో జరిగిన ఈ ఘటనతో అక్కడున్న వాళ్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే మెరైన్ సిబ్బంది రంగంలోకి దిగారు. సముద్రంలో గాలించి రాజేశ్ మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. రాజేశ్ మృతి విషయం తెలియడంతో స్వగ్రామంలో విషాదచాయలు అలుముకున్నారు. రాజేశ్ మృతి పట్ల అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ సంతాపం తెలిపారు. రాజేశ్ కుటుంబ సభ్యులను ఫోన్‌లో పరామర్శించారు. రాజేశ్ మృతదేహాన్ని స్వదేశం తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని తానా ప్రతినిధులను కోరారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు