నా ప్రాణాలకు హాని ఉంది
కోదాడలో గేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఓనర్‌పై హత్యాయత్నం జరిగింది. కాంతారావు హత్య కోసం రూ.50 లక్షలు ఇచ్చేందుకు సుపారీ గ్యాంగ్‌తో కాలేజ్ భాగస్వాములు ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో సుపారీ గ్యాంగ్‌కు ముందుగా రూ.5 లక్షలు కూడా చెల్లించారు. దీంతో, కాంతారావు ప్రయాణిస్తున్న కారును డీసీఎం వ్యాన్‌తో ఢీకొట్టాలని ప్లాన్ చేసుకున్నారు.
పోలీసుల అదుపులో నిందితులు
మునగాల మండలం మద్దెలచెరువు వద్ద కారును ఢీకొట్టేందుకు ప్రయత్నం చేశారు. అయితే, సుపారీ గ్యాంగ్ నుంచి కాంతారావు తప్పించుకుని వెళ్లిపోయారు. కాగా, సుపారీ గ్యాంగ్.. కోదాడలో కాంతారావు కారును డీసీఎంతో ఢీకొట్టడంతో ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ క్రమంలో తేరుకున్న కాంతారావు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. 12 మందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.