iPhone: కొత్త యాపిల్ ఫోన్‌తో మీ జేబుకు చిల్లు పడొచ్చు.. త్వరలోనే మార్కెట్‌లోకి ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్..! యాపిల్ ఐఫోన్ 15 ధర ఇండియాలో దిమ్మదిరిగే రేంజ్‌లో ఉండనుందట. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఇటీవలే మార్కెట్లోకి విడుదలైన ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ కంటే ఎక్కువ ధర ఉండొచ్చని ప్రముఖ టెక్ నిపుణులు చెబుతున్నారు. By Trinath 09 Jul 2023 in బిజినెస్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి ఐఫోన్ లవర్స్‌కు అలర్ట్.. ఈ ఏడాదే మార్కెట్‌లోకి ఐఫోన్ కొత్త రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్‌లో లాంచ్ చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. కంపెనీ అధికారికంగా చెప్పకపోయినా గతేడాది లాంచ్ డేట్ ఆధారంగా అంచనా వేస్తున్నారు. అదే సమయంలో యాపిల్ ఐఫోన్ 15 ధర ఇండియాలో దిమ్మదిరిగే రేంజ్‌లో ఉండనుందట. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఇటీవలే మార్కెట్లోకి విడుదలైన ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ కంటే ఎక్కువ ధర ఉండొచ్చని ప్రముఖ టెక్ నిపుణులు చెబుతున్నారు. ఐఫోన్ 15 ప్రో మోడల్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్న అన్ని యాపిల్ ఫోన్స్ కంటే పది రేట్లు ఎక్కువ ఉండే అవకాశాలున్నాయని అంటున్నారు. ప్రతికాత్మక చిత్రం ఏడాదికి ఓ ఫోన్ లాంచ్: ప్రతి ఏడాది యాపిల్ నుంచి ఓ మోడల్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఏడాది సెప్టెంబర్ లాంచ్ కానున్న మోడల్ ఐఫోన్ 15. ఈసారి ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌తో పాటు ఐఫోన్ 15 ప్లస్ నెక్స్ట్ కూడా ఉండొచ్చు. ఈసారి ఎప్పటిలా కాకుండా ఇండియాలో ఐఫోన్ 15 ధరలు ఎక్కువ ఉండవచ్చని సమాచారం. మరోవైపు రానున్న ఐఫోన్‌లో బ్యాటరీ కెపాసిటీ ఎక్కువన్న ప్రచారం జరుగుతోంది. 3,877 ఎంఏహెచ్ బ్యాటరీ అంటే ఐఫోన్ 14తో పోల్చుకుంటే 18 శాతం ఎక్కువ ఉంటుంది. ఐఫోన్ 15 ప్లస్‌లో 4,912ఎంఏహెచ్(13.6 శాతం), ఐఫోన్ 15 ప్రొలో 3650 ఎంఏహెచ్(14.1 శాతం), ఐఫోన్ 15 ప్రొ మాక్స్‌లో 4852 ఎంఏహెచ్ బ్యాటరీ(10.9 శాతం) ఉంటుందన్న లీకులు వస్తున్నాయి. ఇవన్నీ 48ఎంపీ కెమెరాతో రానున్నాయి. ఐఫోన్ 15లో మార్పులివే..? సాధారణంగా ప్రతి ఐఫోన్‌కి మ్యూట్ స్విచ్ ఉంటుంది. ఎడమవైపు పైభాగాన ఫ్లాట్‌గా, సన్నగా ఉంటుంది. ఇక ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌లో మార్పులు రానున్నాయి. పౌచ్ డిజైన్ ప్రకారం ఈ మ్యూట్ స్విచ్ డిజైన్ కాస్త మారింది. ఈ సారి మరింత పెద్దగా, సర్కిల్ ఆకారంలో కనిపిస్తోంది. దీనికి మరో ఫీచర్‌ను యాడ్ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఈ మ్యూట్ స్విచ్ కేవలం మ్యూట్ చేయడానికే వాడేవారు. కానీ ఇక నుంచి ఇది కస్టమైజ్డ్ బటన్‌గా రానుందట. అంటే ఈ బటన్‌ను యూజర్లు కస్టమైజ్ చేసుకోవచ్చు. మ్యూట్ చేయడమే కాకుండా, నచ్చిన ఫంక్షన్లను బటన్‌కు యాడ్ చేయొచ్చు. అటు సాలిడ్ స్టేట్ బటన్స్, మరింత మన్నికగా ఉండటానికి టైటానియం ఫ్రేమ్, ర్యామ్(RAM) కెపాసిటీ ఎక్స్‌టెన్షన్ లాంటివి ఇందులో ఉండనున్నాయట..! అటు ఐఫోన్ 15 నాన్ ప్రొ మోడల్స్ విషయానికి వస్తే, ఆల్-న్యూ గ్రీన్ షేడ్ జతవుతోంది. ఐఫోన్ 12, ఐఫోన్11 రెండూ గ్రీన్ కలర్‌తో వచ్చాయి. ఆ రెంటికి దగ్గరగా ఈ గ్రీన్ కూడా ఉంటుందని అంటున్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి