విశాఖలో వెలుగు చూసిన సీఐ స్వర్ణలత దందా దేశంలో మోసగాళ్లు ఎక్కువైపోయారు. ఈజీగా డబ్బులు కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. అమాయకులు, అత్యాశపరులే వారి టార్గెట్. ఎక్కువ మనీ ఆశ చూపించి అడ్డంగా దోచేస్తున్నారు. మోసపోయామని బాధితులు తెలుసుకునేలోపే డబ్బుతో డాయిస్తున్నారు. పక్క వాళ్ల దగ్గర డబ్బులు ఉన్నాయి అనే సమాచారం తెలిస్తే చాలు. ఆ డబ్బులను దండుకోవడానికి అనేక మాయోపాయాలు చేస్తున్నారు. By Vijaya Nimma 07 Jul 2023 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి విశాఖపట్నంలో మరో దందా వెలుగులోకి వచ్చింది. రూ. 90 లక్షల 500 నోట్లు ఇస్తే కోటి రూపాయల 2000 నోట్లు ఇస్తామని ఇద్దరు రిటైర్డ్ నేవల్ ఆఫీసర్లను ఓ ముఠా మోసం చేసింది. ముఠాకు ఏఆర్ సీఐ స్వర్ణలత నాయకత్వం వహించారు. ప్రస్తుతం హోమ్ గార్డ్స్ సీఐగా స్వర్ణలత పనిచేస్తున్నారు. రూ. 90 లక్షల్లో సీఐ స్వర్ణలత రూ. 20 లక్షలు నొక్కేశారు. సీఐ స్వర్ణలత తన సిబ్బంది చేత బాధితులను బెదిరించి కొట్టి పంపేశారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలిగా స్వర్ణలత ఉన్నారు. రిటైర్డ్ నేవల్ ఆఫీసర్స్ కొల్లి శ్రీను, శ్రీధర్ పోలీసులను ఆశ్రయించారు. అయితే రూ.2 వేల నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆర్‌బీఐ ప్రకటన చేసిన నేపథ్యంలో.. దీనిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అన్ని కుయుక్తులు పన్నుతున్నారు. అయితే ఇలాంటి మోసాలను నిర్మూలించాల్సిన పోలీసులే అవినీతికి పాల్పడుతున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు. ఇలాంటి దోపిడీ అధికారుల కారణంగా మొత్తం పోలీస్ వ్యవస్థకే చెడ్డపేరు వస్తోంది. తాజాగా వెలుగు చూసిన విశాఖపట్నంలోని ఘటన అందరిని విస్మయానికి గురి చేసింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపా లని డీసీపీ -1 విద్యాసాగర్ నాయుడు, క్రైమ్ డీసీపీ జి.నాగన్నలను ఆదేశించారు. విచారణలో ఆ ఆరోపణలు వాస్తవమేనని తేలడంతో సీపీకి నివేదించారు. మరోవైపు రిటైర్డ్ నేవీ ఉద్యోగులను బెదిరించి లక్షలు కాజేసిన సీఐకు అనుకూలంగా రాజకీయ ఒత్తిళ్లు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. నిందితులైపై చర్యలకు సిద్దమైన సమయంలో నగరానికి చెందిన ఒక వైసీపీ ప్రజాప్రతినిధి ఫోన్ చేసి. కేసు లేకుండా వదిలేయాలని ఒత్తిడి తెచ్చినట్లు పోలీసు వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఘటనపై అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. బాధితులు నగదుతో వస్తున్నారనే సమాచారం లీక్ చేసి కొట్టేసినట్టు ప్రచారం జరుగుతోంది. గతంలోనూ ఇలాంటి దోపిడీలు చేసి ఉంటారని.. ఇప్పుడు బయటపడి ఉంటుందని చెబుతున్నారు. అయితే ఇప్పుడు స్వర్ణలతను అరెస్ట్ చేస్తారా లేకపోతే.. అలాంటి ఆఫీసర్లే తమ బలం అని వదిలేస్తారా అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి