మీకు భోజనం చేసిన తర్వాత నడిచే అలవాటు ఉందా? లేదంటే.. ఇప్పటినుంచే తినగానే కాసేపు నడవడం అలవాటు చేసుకోండి. చాలామంది తిన్నవెంటనే చిన్నగా నిద్రపోతుంటారు. అది మీ ఆరోగ్యానికి మంచిది కాదు. ఆరోగ్యకరమైన జీర్ణక్రియ, మెరుగైన ఆరోగ్యం కోసం ప్రతి భోజనం తర్వాత కొద్దిసేపు నడవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. తిన్న తర్వాత, ఒక చిన్న నడక ద్వారా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. తిన్న తర్వాత ఎందుకు నడవాలి? ఈ 5 కారణాలను తప్పక తెలుసుకోండి.
1. మెరుగైన జీర్ణక్రియ :
తిన్న తర్వాత నడవడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కడుపు కండరాలు, ప్రేగులను ప్రేరేపించడం ద్వారా జీర్ణక్రియకు నడక సాయపడుతుంది. ఆహారం వేగంగా కదలడానికి వీలు కల్పిస్తుంది. ఇది గుండెల్లో మంట, మలబద్ధకం, ఉబ్బరం, ఆమ్లత్వం, కడుపు నొప్పి వంటి సమస్యలను నివారించడంలో కూడా సాయపడుతుంది.
2. నియంత్రిత రక్తంలో చక్కెర :
మధుమేహం ఉన్నవారికి భోజనం తర్వాత నడవడం చాలా ముఖ్యం. భోజనం తర్వాత వ్యాయామం చేయడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నిరోధించడంలో సాయపడుతుంది. అంతేకాదు..రోజంతా రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపరుస్తుంది.
3. ఆరోగ్యకరమైన బరువు :
నడక అనేది సులభమైన వ్యాయామం. కేలరీలను బర్న్ చేయడంలో సాయపడుతుంది. తొందరగా బరువు తగ్గవచ్చు. నడక మంచి మానసిక ఆరోగ్యం కూడా. అలాగే, గుండె ఆరోగ్యాన్ని సైతం పెంచుతుంది. శక్తి స్థాయిలను మెరుగుపరుస్తుంది. మీ కండరాలు, ఎముకలను బలోపేతం చేయడం వంటి అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
4. రక్తపోటును నియంత్రిస్తుంది :
భోజనం తర్వాత నడవడం రక్తపోటును నియంత్రించగలదని కొన్ని అధ్యయనాలు చూపిస్తున్నాయి. మీరు హైపర్‌టెన్సివ్‌గా ఉంటే.. తిన్న తర్వాత క్రమం తప్పకుండా నడవడం చాలా మంచిది. ఆరోగ్యకరమైన రక్తపోటు ఉండేలా సాయపడుతుంది.
5. మంచి నిద్ర :
నడకతో మీ శరీరం రిలీఫ్ అవుతుంది. నిద్రలేమి సమస్యను నియంత్రిస్తుంది. తినడం తర్వాత జీర్ణ రుగ్మతలను తొలగిస్తుంది. మంచి నిద్రను ప్రోత్సహించడంలో సాయపడుతుంది.