మరో బాలీవుడ్ మూవీలో తమన్నా... బిజీబిజీగా మిల్కీబ్యూటీ By Vijaya Nimma 13 Jul 2023 in సినిమా Scrolling New Update షేర్ చేయండి స్పెషల్ సాంగ్స్ ప్రముఖ బాలీవుడ్, టాలీవుడ్ నటి మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కెరీర్ ఫుల్ స్వింగ్‌లో ఉంది. తెలుగు, తమిళ చిత్రాలతో పాటు బాలీవుడ్‌లోనూ దూసుకెళ్తోంది. ఓవైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్‌లు మధ్యలో స్పెషల్ సాంగ్స్ తో చాలా బిజీగా ఉంది. తాజాగా ఆమె ఖాతాలో మరో బాలీవుడ్ చిత్రం చేరింది. బాలీవుడ్ కండల వీరుడు జాన్ అబ్రహం హీరోగా నిఖిల్ అద్వానీ తెరకెక్కిస్తున్న వేదా అనే చిత్రంలో తమన్నా కీలక పాత్ర పోషించనుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం ప్రకటించింది. జాన్ అబ్రహం, దర్శకుడు నిఖిల్‌తో దిగిన ఫొటోలను తమన్నా తన ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఈ సినిమా బలమైన కథతో పాటు మునుపెన్నడూ చూడని పోరాట సన్నివేశాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అసీమ్ అరోరా కథ అందించిన ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుగుతోంది. జీ స్టూడియాస్, ఎమ్మాయ్ ఎంటర్ టైన్మెంట్, జేఏ ఎంటర్ టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం తమన్నా తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన భోళా శంకర్‌లో హీరోయిన్‌గా నటించింది. మొదటి స్థానంలో తమన్నా ఇటీవల IMDb అత్యధికంగా ఇష్టపడిన ప్రముఖ భారతీయ సెలబ్రిటీల జాబితాను విడుదల చేసింది. అందులో తమన్నా మొదటి స్థానంలో నిలిచింది. దక్షిణాదికి చెందిన ఈ నటి జాబితాలో రెండవ స్థానంలో ఉన్న కింగ్ ఆఫ్ బాలీవుడ్ షారుక్ ఖాన్‌ను కూడా ఓడించింది. మృణాల్ ఠాకూర్, కియారా అద్వానీ, రామ్ చరణ్, రణ్‌వీర్ సింగ్, దళపతి విజయ్‌లతో సహా చాలా మంది పెద్ద నటీనటులను తమన్నా ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంచింది. ఎన్నో హిట్ చిత్రాలు తమన్నా భాటియా మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్.. సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్‌లోనూ ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. దాదాపు దశాబ్దంన్నర కాలంగా సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు పోషిస్తోంది. ఎక్కడో ఒక చోట తన కష్టానికి ఫలితం దక్కే స్థితి ఈరోజు వచ్చింది. తన వర్క్ ఫ్రంట్ గురించి మాట్లాడుతూ.. ఆమె చాలా ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. మలయాళంలో బాంద్రా, తమిళంలో జైలర్, తెలుగులో అరణ్మనై 4, భోలా శంకర్ వంటి క్రేజీ ప్రాజెక్టుల్లో ఆమె నటిస్తోంది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి